తాజావార్తలు

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన రీసెంట్ తెలుగు సినిమా.. యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యే మూవీ

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన రీసెంట్ తెలుగు సినిమా.. యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యే మూవీ


ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తూనే ఉంటాయి. అయితే దాదాపుగా వీకెండ్‌లోనే అందులోనూ ఎక్కువగా శుక్రవారమే కొత్త సినిమాలు/ వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. అయితే ఈ తెలుగు సినిమా మాత్రం సోమవారం (జులై 06) స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా. టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా అద్భుతమైన పాటలు పాడుతూ స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది సునీత. అంతేకాదు పలువురు స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పిందీ బ్యూటిఫుల్ సింగర్. ఇప్పుడు ఆమె కుమారుడు హీరోగా రాణిస్తున్నాడు. ‘సర్కౌర్ నౌకరి’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ఆకాశ్ గోపరాజు. మొదటి సినిమాతోనే మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. రీసెంట్ గానే కొత్త మలుపు అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు.
జూన్ 12న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ను ముఖ్యంగా యూత్ కు ఈ మూవీ బాగా కనెక్ట్ అయ్యింది. అయితే ఇప్పుడీ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

కొత్త మలుపు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచే ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. కొత్త మలుపు సినిమాకు శివ కేసనకుర్తి దర్శకత్వం వహించారు. ఆకాశ్ సరసన భైరవి ఆర్థ్యా హీరోయిన్‌గా నటించింది. వీరితో పాటు పృథ్వీ, రఘుబాబు, మహేందర్, ఐశ్వర్య, సిద్ధు, ప్రభావతి తదితరులు కీలకపాత్రలు పోషించారు. యశ్వంత్ నాగ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మరి థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన సునీత కుమారుడి సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి



అమెజాన్ ప్రైమ్ వీడియోలో సునీత కుమారుడి కొత్త సినిమా..

కొత్త మలుపు సినిమాలో ఆకాశ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *