చార్మికి మంచి గ్రాస్పింగ్ సామర్థ్యం, ఎమోషనల్ అభినయం, అందమైన కళ్ళు, ఆకట్టుకునే ఫిజిక్ ఉన్నాయని తెలిపారు. అలాగే, ఆమె ఒక మంచి డ్యాన్సర్ అని, ఆమెలో ఒక ప్రత్యేకమైన జోష్, ఎనర్జీ ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన అన్నారు. ఇన్ని ప్రతిభలు ఉన్నప్పటికీ, ఆమె కెరీర్ అనుకున్నంత విజయవంతం కాకపోవడం ఒక మిరాకిల్ వంటిదని, దీనికి కారణం అదృష్టం తప్ప మరొకటి కాదని కృష్ణవంశీ చెప్పారు. తాను వ్యక్తిగతంగా చార్మికి మద్దతుగా నిలిచానని, ఆమె కెరీర్ కోసం రెండు, మూడు సార్లు ప్రయత్నించానని దర్శకుడు వెల్లడించారు.
