ISRO GSLV-F17 launch: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక రాకెట్ ప్రయోగానికి సిద్దమైంది. తిరుపతి జిల్లా సతీష్ దావన్ స్పేస్ సెంటర్ షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి సెప్టెంబర్ నెల 4వ తేదీన తెల్లవారుజామున 2.55 గంటలకు GSLV-F17 రాకెట్ ప్రయోగం విజయవంతంగా జరిపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రంలోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరిపేందుకు ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించి MMR మీటింగ్ ఈ ఉదయం షార్‌లో జరిగింది. GSLV-F17 రాకెట్ ప్రయోగం ద్వారా 2367 కేజీలు బరువు కలిగిన Eos -05 అనే (earth observation శాటిలైట్) భూ పరిశీలనా ఉపగ్రహంను 28 ,934 వేల కిలోమీటర్ల ఎత్తులో నిర్దేశించిన భూ బదిలీ కక్ష (GTO)జియో transfer orbitలోకి ఈ శాటిలైట్ ను ప్రవేశపెట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం విజయవంతం అయితే భారత దేశ రక్షణ వ్యవస్థ కు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
అంతే కాకుండా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లే సమయంలో మత్స్య సంపద ఎక్కడ ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతాన్ని ఈ ఉపగ్రహం ద్వారా గుర్తించవచ్చు, దేశ సరిహద్దు ప్రాంతాలలో శత్రు దేశాల కదలికలను గట్టి నిఘాతో రక్షణ వ్యవస్థకు సమాచారం అందిస్తుంది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకునే సమయంలో ముందుగా వచ్చే విపత్తులను గుర్తించి ముందస్తు జాగ్రత్తల కోసం సమాచారం శాస్త్రవేత్తలకు అందిస్తుంది. ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే షార్‌లో రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసుకుని శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్ వద్ద రాకెట్ ప్రయోగ రిహార్సల్స్‌ను విజయవంతంగా నిర్వహించారు.
ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియను కూడా 27 గంటల ముందు శాస్త్రవేత్తలు ప్రారంభించనున్నారు. ఈ రాకెట్ ప్రయోగం ను మూడు దశల తో జరుపనున్నారు. వాతావరణం గనుక సానుకూలంగా స్పందిస్తే శాస్త్రవేత్తలు అనుకున్న సమయానికి అనగా ఈ నెల 4 వ తారీకున తెల్లవారుజామున రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు GSLV-F17 రాకెట్ ప్రయోగంను విజయవంతంగా పూర్తి చేసేందుకు ఇస్రో సిద్ధంగా ఉంది. ప్రయోగం విజయవంతం కోసం ఇస్రో చైర్మన్ నారాయణన్ శాస్త్రవేత్తల బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుని అలాగే సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
