ఈ వేసవిలో స్నేహితులు, కుటుంబంతో కలిసి ఏదైనా అందమైన ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే, మీ కోసం ఇప్పుడు ఒక మంచి అవకాశం సిద్ధంగా ఉంది. అదే కేరళ టూర్ సూపర్ ప్యాకేజీ. పచ్చని కొండలు, ప్రశాంతమైన బ్యాక్‌వాటర్స్, అద్భుతమైన ప్రకృతి అందాలతో “గాడ్స్ ఓన్ కంట్రీ”గా పేరుగాంచిన కేరళ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అందుకే సెలవులు వచ్చిన వెంటనే చాలా మంది ఇక్కడికి ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు సమ్మర్ సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో ప్రయాణికుల కోసం IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. “కేరళ హిల్స్ అండ్ వాటర్స్” పేరుతో ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తోంది.
టూర్ వివరాలు:
ఈ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ప్రతి మంగళవారం సికింద్రాబాద్ నుంచి ట్రిప్ ప్రారంభమవుతుంది. నల్గొండ, గుంటూరు, తెనాలి స్టేషన్లలో బోర్డింగ్ సదుపాయం ఉంది.
సందర్శించే ప్రాంతాలు:
మున్నార్, అలెప్పీతో పాటు పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ఈ టూర్లో కవర్ చేస్తారు.
ప్రయాణ షెడ్యూల్:
1వ రోజు: సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 2:25కి శబరి ఎక్స్‌ప్రెస్ (20629) బయలుదేరుతుంది. ఓవర్‌నైట్ జర్నీ ఉంటుంది.
2వ రోజు: ఉదయం అలువా చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మున్నార్ చేరుకుంటారు. హోటల్లో చెక్ఇన్ తరువాత స్థానిక ప్రదేశాల సందర్శన ఉంటుంది. రాత్రి మున్నార్‌లో బస.
3వ రోజు: ఎరవికులం నేషనల్ పార్క్, టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్ వంటి ప్రదేశాల సందర్శన. రాత్రి మళ్లీ మున్నార్‌లోనే బస.
4వ రోజు: మున్నార్ నుంచి చెక్అవుట్ చేసి అలెప్పీకి ప్రయాణం. అక్కడ హోటల్లో చెక్ఇన్ తర్వాత బ్యాక్‌వాటర్ టూర్‌ను ఆస్వాదించవచ్చు. రాత్రి అలెప్పీలో బస.
5వ రోజు: ఎర్నాకులంకు ప్రయాణం. అక్కడ నుంచి మధ్యాహ్నం 11:15కి శబరి ఎక్స్‌ప్రెస్ (20630) ద్వారా హైదరాబాద్‌కు రిటర్న్ జర్నీ ప్రారంభం.
6వ రోజు: ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
టికెట్ ధరలు:
కంఫర్ట్ (3AC):
- సింగిల్ షేరింగ్: ₹32,240
- ట్విన్ షేరింగ్: ₹18,970
- ట్రిపుల్ షేరింగ్: ₹16,440
- పిల్లలు (5–11 ఏళ్లు): ₹8,150 – ₹10,550
స్టాండర్డ్ (స్లీపర్ క్లాస్):
- సింగిల్ షేరింగ్: ₹32,730
- ట్విన్ షేరింగ్: ₹17,720
- ట్రిపుల్ షేరింగ్: ₹15,060
- పిల్లలు: ₹6,560 – ₹9,270
ప్యాకేజీలో ఉండేవి:
- రైల్వే టికెట్లు
- స్థానిక రవాణా (ప్యాకేజీ ప్రకారం)
- 3 రోజులు హోటల్ వసతి (బ్రేక్‌ఫాస్ట్‌తో)
- ట్రావెల్ ఇన్సూరెన్స్
- ఈ ప్యాకేజీ మే 5, 12, 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంది.
- బుకింగ్, పూర్తి వివరాల కోసం IRCTC అధికారిక వెబ్సైట్ https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=SHR092 ను చూడవచ్చు.
