తాజావార్తలు

Gold Price Today: అదే ధరతో ఊగిసలాడుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..

Gold Price Today: అదే ధరతో ఊగిసలాడుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..


Gold, Silver Prices Today: దేశంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉన్నాయి. బుధవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధర పెరుగుదల కనిపించింది. అయితే తాజాగా ఏప్రిల్‌ 23వ తేదీన అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ధరలు తగ్గినా, పెరిగినా షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. అయితే తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  1. హైదరాబాద్‌: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,740 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,840 ఉంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,740 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,840 ఉంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,890 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,990 ఉంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,740 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,840 ఉంది.
  5. ఇవి కూడా చదవండి

  6. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,490 ఉంది.
  7. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,740 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,840 ఉంది.
  8. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,740 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,840 ఉంది.
  9. కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,740 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,840 ఉంది.
  10. ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా స్వల్పంగానే తగ్గింది. కిలో వెండి ధర హైదరాబాద్‌, చెన్నై, కేరళలో రూ.2,74,900 వద్ద ఉండగా, ఇతర ప్రాంతాల్లో రూ.2,64,900 వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Silver Price Crash: వెండి ధరల్లో పెను పతనం? కిలో వెండి లక్షకు చేరుతుందా? మార్కెట్‌లో ప్రకంపనలు.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

గోల్డ్‌ స్వచ్ఛతను తెలుసుకోవడం ఎలా?

ఇక బంగారం కొనేవారు నగలపై తప్పనిసరిగ్గా హాల్‌ మార్క్‌ను గమనించాలి. ఇది లేనిది బంగారం విక్రయించేందుకు అనుమతి లేదు. ఇక గోల్డ్‌ స్వచ్ఛతను తెలుసుకోవడానికి ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో ‘బీఐఎస్‌ కేర్‌’ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం మీ పేరు, ఫోన్‌ నంబర్‌, మెయిల్‌ ఐడీ, ఓటీపీతో ముందు యాప్‌లోకి లాగిన్‌ అవ్వాలి. అనంతరం యాప్‌ ఓపెన్ కాగానే ‘వెరిఫై హెచ్‌యూఐడీ’ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. ఆ తర్వాత మీరు కొనుగోలు చేసే ఆభరణంపై ఉన్న హెచ్‌యూఐడీ నంబర్‌ను ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌పై నొక్కాలి. వెంటనే మీ ఆభరణానికి సంబంధించిన హాల్‌మార్క్‌ చేయించిన షాప్‌, హాల్‌ మార్క్‌ వేసిన కేంద్రం, బంగారం స్వచ్ఛత వంటి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

DMart ఏప్రిల్ 4వ వారం మెగా ఆఫర్లు.. 80% వరకు డిస్కౌంట్.. బై వన్ గెట్ వన్ ఫ్రీ డీల్స్‌తో కస్టమర్లకు పండుగ!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *