మసీదు ప్రార్థనా సమయంలో భారీ పేలుడు.. 16 మంది మృతి.. 50 మందికి సీరియస్!
పాకిస్తాన్లో మరోసారి భారీ పేలుడు కలకలం రేపింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని కోహట్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. పోలీస్ లైన్స్ సమీపంలో శుక్రవారం (సెప్టెంబర్ 18) జరిగిన అనుమానిత ఆత్మాహుతి దాడిలో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది పౌరులు, ఐదుగురు పోలీసు సిబ్బంది ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసు ఉన్నతాధికారి జుల్ఫికర్…
