బంగారు వర్ణంలో మెరిసిపోతున్న మేడారం.. వనదేవతల దర్శనం కోసం పోటెత్తున్న భక్తులు..!
మేడారానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహా జాతర సమీపిస్తుండడంతో రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతోంది. మహా జాతర ముందే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు.. వివిధ ప్రాంతాల నుంచి భక్తజనం లక్షలాదిగా తరలివస్తున్నారు. దీంతో మేడారంలో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రత్యేకించి.. మేడారంలోని పలు ప్రాంతాల్లో ఉదయం-సాయంత్రం- రాత్రి వేళ్లలోని డ్రోన్ దృశ్యాలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం రాత్రి వేళ…
