Hyderabad: సబ్‌రిజిస్ట్రార్ ఆస్తులు ఏకంగా రూ.100 కోట్లు.. ఏసీబీ వలకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం!
హైదరాబాద్, జనవరి 24: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల దందా షరా మామూలే. ముఖ్యంగా రెవెన్యూశాఖలో ఎందెందు వెతికినా.. అందందె లంచం రాయుళ్లు దర్శనమిస్తారు. తాజాగా మరో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారుల వలకు చిక్కింది. ఏకంగా రూ.100 కోట్ల ఆస్తులు కూడబెట్టిన ఓ రెవెన్యూ అధికారి ఏసీబీ అధికారులకు దొరికాడు. ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టినందుకు ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్-రిజిస్ట్రార్ (SRO-1) కె. మధుసూధన్ రెడ్డిపై ACB అధికారులు శుక్రవారం…
