నాంపల్లి ఘటన తర్వాత అలర్ట్ అయిన హైడ్రా.. వ్యాపారులకు చివరి ఛాన్స్!
నాంపల్లిలో ఇటీవల చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదం హైడ్రాను అప్రమత్తం చేసింది. ఈ ఘటనను హెచ్చరికగా తీసుకున్న హైడ్రా నగరంలోని ఫర్నిచర్ షాపులపై దృష్టి పెట్టింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపారాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి, ఫైర్ సేఫ్టీ పాటించని పలు షాపులను అధికారులు మూసివేశారు. ఈ నేపథ్యంలో శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధ్యక్షతన కీలక సమన్వయ సమావేశం జరిగింది. జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులు, వ్యాపార సంఘాల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా…
