ఇనుప రాడ్లు, ఖాళీ సీసాలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు..! కారణం ఏంటంటే..
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో పాత కక్షలు భగ్గుమన్నాయి.. హరిచంద్ తండాలో రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవ చిలికి చిలికి గాలివానలా మారి..పరస్పర దాడులకు దారితీసింది. ఇనుప రాడ్లు, ఖాళీ సీసాలతో దాడులు చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి..ఈ ఘటన తండాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కౌడిపల్లి మండలం హరిచంద్ తండాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండాకు చెందిన రాందాస్ నరేందర్, దాసురు స్వరూప, రవీ, రెడ్యా వర్గానికి.. అదే తండాకు…
