ప్రపంచ వేదికపై తెలుగు తేజం !! సిక్కోలు యువకుడి ఘనత
తెలుగు విద్యార్థులు జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ వేదికలపై కూడా తమ సత్తా చాటుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన అభి చంద్ర కార్తీక్ అరుదైన ఘనత సాధించి జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ , కింగ్స్ కాలేజీ లండన్.. ఈ మూడు అత్యున్నత సంస్థల్లో ప్రవేశానికి ఒకేసారి ఎంపికై చరిత్ర సృష్టించారు. శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త ..నూర్తి కళ్యాణ్ బాబు…
