తాజావార్తలు

తిరుచానూరులో విషాదం.. ఏనుగు శ్రీనిధి దాడిలో మావాటి చంద్రశేఖర్ మృతి!

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఏనుగు దాడి కి గురైన మవాటి చంద్రశేఖర్ మృతి చెందాడు. ఈ నెల 4 సాయంత్రం 6 గంటల సమయంలో వాహన మండపం వద్ద శ్రీనిధి అనే ఏనుగు దాడి చేయగా నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన మావాటి చంద్రశేఖర్ కొలుకోలేక పోయాడు. ఉంజల్ సేవకు గజశాల నుంచి ఆలయం వద్దకు ఏనుగును తీసుకొస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మావాటి చంద్రశేఖర్ ను తొండంతో చుట్టి…

Read More

సద్భావన ఎక్స్‌ప్రెస్ రైళ్లో షాకింగ్‌ ఘటన.. రాత్రి 10 గంటలు దాటగానే మొదలైన రచ్చ..!

సద్భావన ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు, రాత్రి వేళ కోచ్‌లో సహ-ప్రయాణికులు గట్టిగా మాట్లాడుతుండటంతో రాత్రి 10 గంటల తర్వాత శబ్ద నియమాలపై ఎక్స్ వేదికగా రైల్వే సవాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైలు ప్రయాణాల్లో పాటించాల్సిన నిబంధనలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సద్భావన ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తి రాత్రి సమయం దాటినా తోటి ప్రయాణికులు నిరంతరాయంగా గట్టిగా మాట్లాడుకుంటూ రచ్చ చేస్తుండటంతో, వారిని ఎంత కోరినా…

Read More

ఊరి బయట గుడి దగ్గర ఏదో అలికిడి.. స్థానికుల సమాచారంతో రంగంలోకి ఖాకీలు..!

పురాతన దేవాలయాలు అంటే అక్కడ ఏదో గుప్త నిధులు ఉన్నాయి అని చాలామంది నమ్ముతారు. అంతేకాక అటవీ ప్రాంతంలో ఉన్న దేవాలయాల దగ్గర గుప్తనిధుల తవ్వకాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే గురువారం (అక్టోబర్ 08) పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కాశినాయన జ్యోతిక్షేత్రం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని పవిత్ర పుణ్యక్షేత్రం కాశీనాయన జ్యోతిక్షేత్రంలో నిత్యం…

Read More

Telangana: ఆ ఊరు ఓ పాల పుంత.. ఊరంతా పాడి పరిశ్రమే.. ఏకంగా 2,035 జెర్సీ ఆవులు, 380 పాడి గేదెలు

మట్టిలో మాణిక్యాలు.. పాలతో ప్రగతి పథంలో పయనిస్తున్న పాడి రైతులు. ఎండైనా.. వానైనా.. ఎముకలు కొరికే చలైనా.. తెల్లవారక ముందే నిద్రలేచి పశువుల సంరక్షణలో నిమగ్నమయ్యే రైతులు. ఒకప్పుడు కరువు కాటుతో పూటగడవక పట్టణాలకు వలస వెళ్లిన కుటుంబాలు.. ఇప్పుడు పశుపోషణనే ప్రధాన జీవనోపాధిగా మార్చుకుని స్వయం ఉపాధితో చరిత్ర సృష్టిస్తున్నాయి. ఊరంతా ఒకే మాట.. ఒకే బాటగా పాడి పరిశ్రమను ఎంచుకుని దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం.. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం మాణిక్యపురం. తెల్లవారగానే…

Read More

11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌పై పోక్సో కేసు!

కేరళలో మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సోషల్ మీడియా మహిళా  ఇన్‌ఫ్లుయెన్సర్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. త్రిస్సూర్ జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. నిందితురాలిపై త్రిస్సూర్ వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో పిల్లలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం (POCSO Act) కింద వివిధ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 11 ఏళ్ల బాలుడిపై నిందితురాలు లైంగిక దాడికి పాల్పడినట్లు…

Read More

బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అంటే ఇదే! జైలర్‌గా పనిచేసి.. అదే జైలుకు ఖైదీగా..!

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళా ఖైదీలను నిబంధనలకు విరుద్ధంగా జైలు నుంచి బయటకు తీసుకెళ్లి తన ఇంట్లో పనులు చేయించిన కేసులో అప్పటి మహిళా జైలర్ దివ్య చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలలుగా పరారీలో ఉన్న ఆమెను అజ్మీర్ పోలీసుల సైబర్ సెల్ సాంకేతిక ఆధారాలతో కోటాలో గుర్తించి అదుపులోకి తీసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ఘటన 2026 జూలై 12న చోటుచేసుకుంది. అప్పట్లో అజ్మీర్ మహిళా జైలుకు…

Read More

పాఠశాలలో దొంగలు పడ్డారు.. ల్యాప్‌టాప్, టాబ్లెట్‌లను వదిలి ఏం ఎత్తుకెళ్లారో తెలుసా?

జార్ఖండ్‌లోని సెరైకేలా-ఖర్సవాన్ జిల్లాలోని పిట్కిలోని మాధ్యమిక పాఠశాలలో దొంగతనం కలకలం రేపింది. దొంగలు పాఠశాల ప్రధాన ద్వారం, కార్యాలయం, వంటగది తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అయితే కార్యాలయంలో ఉన్న ల్యాప్‌టాప్, టాబ్లెట్, మ్యూజిక్ సిస్టమ్ వంటి విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను ముట్టుకోకుండా వదిలేశారు. ప్రధానంగా మధ్యాహ్న భోజన వంటగదినే లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం (అక్టోబర్ 07) ఉదయం ఉపాధ్యాయురాలు ఒలివ్ ధన్వార్ పాఠశాలకు చేరుకున్నప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాన ద్వారం…

Read More

అక్కడ వద్దనుకుంటే.. మరో చోట స్థలం కేటాయింపు.. వారికి ఏపీ ప్రభుత్వం సూపర్ గుడ్‌న్యూస్

జగనన్న కాలనీల్లోని ఇళ్ల స్థలాలపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ ప్లాట్లు పొందిన లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేందుకు సుముఖంగా ఉన్నారా లేదో తెలుసుకోవాలని, అక్కడ ప్లాట్లు వద్దనుకున్న వారికి మరో ప్రాంతంలో స్థలాల కేటాయింపును పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లబ్ధిదారులు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని నోటీసులు కూడా పంపనున్నారు. తాజాగా ఈ అంశంపై మంత్రులతో సమావేశమైన సీఎం చంద్రబాబు, వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ జగనన్న కాలనీల్లో ఇళ్ల…

Read More

ఈ ఒక్క ఆకుతో మొండి తామరకు శాశ్వత పరిష్కారం? మంట పుట్టదు.. మచ్చలు మాయం

ఈ చిట్కాను పాటించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చర్మాన్ని ఎప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. ఇతరుల బట్టలు, టవల్స్ వాడకుండా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. గరికపోక పేస్ట్ వాడినప్పుడు కొద్దిగా మంట అనిపించినా, లేదా వారం తర్వాత కూడా తామర తగ్గకపోయినా, సమస్య మరింత తీవ్రమైతే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది

Read More

Krishna : కృష్ణతో 45 సినిమాల్లో నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని డిమాండ్.. ఏం చేస్తున్నారంటే..

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జయప్రద సూపర్ స్టార్ కృష్ణతో తన వృత్తిపరమైన అనుబంధం గురించి, కెరీర్‌లోని ముఖ్య సంఘటనల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కృష్ణ గారితో కలిసి తాను 45 చిత్రాలలో నటించానని, ఆయన తన జీవితంలో గొప్ప సహాయ సహకారాలు అందించారని తెలిపారు. కృష్ణ గారిని ఒక నటుడిగా, దర్శకుడిగా, మంచి మనిషిగా తాను గౌరవిస్తానని, ఆయనకు తన ధన్యవాదాలు తెలియజేశారు. కృష్ణ గారితో కలిసి అనేక మంచి క్యారెక్టర్లు చేశామని పేర్కొన్నారు. తనకు…

Read More