తాజావార్తలు

జడ్చర్లలో వింత కాకి ప్రత్యక్షం.. అపశకునం అంటున్న స్థానికులు!

జడ్చర్లలో వింత కాకి ప్రత్యక్షం.. అపశకునం అంటున్న స్థానికులు!


సాధారణంగా కాకులను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ, తలపై ఈకలు లేకుండా పూర్తిగా బట్టతలతో ఉండే కాకిని ఎప్పుడైనా చూశారా? మీరు విన్నది నిజమే. మనుషుల్లో బట్టతలలాగే కొన్ని పక్షుల్లో కూడా బట్టతల పక్షులుంటాయట. అందుకు ఉదాహరణే.. ఈ ఘటన. మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్లలో బట్టతలతో ఉన్న కాకి ఒకటి దర్శనమిచ్చింది. డా.బూర్గుల రామకృష్ణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని బొటానికల్ గార్డెన్‌లో జూన్‌ 30 మంగళవారం సాయంత్రం ఓ ‘బట్టతల కాకి’ ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచింది. దీన్ని చూసిన పలువురు తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వింత కాకి న్యూస్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఆ కాకిని చూడగానే స్థానికులు అపశకునం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, అలాంటిదేమీ లేదని, అది కేవలం మూఢనమ్మకమని నిపుణులు స్పష్టం చేశారు. కాకి తలపై వెంట్రుకల లేకపోవడం వెనుక పూర్తిగా శాస్త్రీయ కారణాలు ఉన్నాయని బొటానికల్ గార్డెన్ సమన్వయకర్త డాక్టర్ బి. సదాశివయ్య స్పష్టం చేశారు. పక్షులలో పాత ఈకలు రాలిపోయి కొత్త ఈకలు వచ్చే ‘మోల్టింగ్’ అనే సహజ ప్రక్రియ వల్ల ఇలా జరుగుతుందని ఆయన తెలిపారు. కొత్త ఈకలు పూర్తిగా వచ్చే వరకు పక్షుల తల లేదా మెడ భాగం బట్టతలగా కనిపిస్తుంది. కేవలం ఈ ప్రక్రియే కాకుండా.. పరాన్నజీవులు, శిలీంద్రాలు, ‘ఏవియన్ పాక్స్’ వంటి వైరల్ వ్యాధులు, పోషకాహార లోపం, లేదా ఇతర కాకులతో జరిగే పోరాటాల్లో గాయపడటం వల్ల కూడా ఇలా ఈకలు ఊడిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బట్టతల కాకిని చూసి భయపడాల్సిన పనిలేదని, ప్రకృతిలో జరిగే మార్పులను శాస్త్రీయ దృక్పథంతో చూడాలని వారు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సమానత్వానికి సరికొత్త పాఠం.. విద్యార్ధులతోపాటు యూనిఫాంలో ఉపాధ్యాయులు

దుకాణాల్లో కొన్న పచ్చళ్లను లొట్టలేసుకుంటూ తింటున్నారా? ఈ వీడియో చూస్తే.. వాటి జోలికి పోరు!

పదవీ విరమణకు ముందు రోజు పర్మినెంట్ ఉద్యోగం.. టీచర్‌కు వింత అనుభవం

మానవత్వం చాటుకున్న టీచర్‌ విద్యార్ధిని వీపుపై మోస్తూ 6 కి.మీ.

వాషింగ్ మెషిన్‌లో పసిపిల్లలు.. ఏడిస్తే చిత్రహింసలు..! డే కేర్ సెంటర్‌‌లో దారుణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *