తాజావార్తలు

Puri Jagannadh: జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. బ్యాంకాక్‌ ఆస్పత్రిలో వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు: పూరి

Puri Jagannadh: జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. బ్యాంకాక్‌ ఆస్పత్రిలో వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు: పూరి


టాలీవుడ్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ది ప్రత్యేక శైలి. ఆయన సినిమాల్లో హీరోల పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. డైలాగులు కూడా ఓ రేంజ్ లో పేలుతుంటాయి. అందుకే ఈ డైరెక్టర్ తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే సీనియర్ హీరోలైన బాలకృష్ణ నుంచి యంగ్ హీరోల వరకు అందరితోనూ సినిమాలు చేశాడు పూరి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో కలిసి స్లమ్ డాగ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడీ డ్యాషింగ్ డైరెక్టర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉంటోన్న పూరి ఓ స్టార్ హీరో గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ పేరుతో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ఒక ఆసక్తికర విషయం పంచుకున్నారు.

ప్రభాస్ చెప్పిన మాటల ప్రకారం.. ‘బాహుబలి’ మొదటి భాగం రిలీజై సంచలనాలు సృష్టిస్తోన్న సమయంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ చిన్న ఇన్ఫెక్షన్ చికిత్స కోసం బ్యాంకాక్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. వెయిటింగ్ రూమ్‌లో కూర్చున్న పూరిని చూసిన ఓ నర్స్ ఆయన ఇండియా నుంచి వచ్చారా? అని అడిగింది. ఆయన అవునని చెప్పగానే, వెంటనే ‘బాహుబలి?’ అని ప్రశ్నించింది. దాంతో ఆశ్చర్యపోయిన పూరి, ఆమెకు ప్రభాస్‌తో కలిసి దిగిన ఓ పర్సనల్ ఫోటో చూపిస్తూ తాను ప్రభాస్‌కు మిత్రుడినని చెప్పారు.ఆ ఫొటో చూసిన నర్స్ వెంటనే ఆసుపత్రి సిబ్బందికి ఈ విషయం తెలియజేసింది. పూరికి వెయిటింగ్ టైమ్‌ను రద్దు చేసి, నేరుగా ప్రత్యేక గదికి తీసుకెళ్లి చికిత్స అందించింది. ఈ అనుభవాన్ని పూరి జగన్నాథ్ వాయిస్ మెసేజ్ రూపంలో ప్రభాస్‌కు పంపాడు. ఆ సమయంలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి ఉన్న ప్రభాస్ కూడా ఆశ్చర్యానికి గురయ్యారని డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చాడు డార్లింగ్. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ క్రేజ్ కు ఇదొక నిదర్శనమని డార్లింగ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

పూరి జగన్నాథ్, ప్రభాస్ కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. వీటిలో బుజ్జిగాడు సినిమా సూపర్ హిట్ కాగా ఏక్ నిరంజన్ సినిమా జస్ట్ యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ రెండు సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేశాయి.

ఇవి కూడా చదవండి



Puri Jagannadh, Prabhas

Puri Jagannadh, Prabhas

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *