తాజావార్తలు

బట్టతలతో కనిపించిన కాకి… అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింతా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..

బట్టతలతో కనిపించిన కాకి… అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింతా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..


ప్రతిరోజు మన కళ్లముందు కనిపించే కాకి… ఒకరోజు తలపై ఈకలు లేకుండా, బట్టతలతో కనిపిస్తే? చాలామంది దానిని వింతగా చూస్తారు. ఇంకొందరైతే అపశకునంగా భావిస్తారు. కానీ వాస్తవానికి దీనికి ఎలాంటి మూఢనమ్మకాలతో సంబంధం లేదు. పూర్తిగా శాస్త్రీయ కారణాలే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

జడ్చర్లలో చర్చనీయాంశంగా మారిన బట్టతల కాకి:

నిన్న సాయంత్రం జడ్చర్లలోని డా.బూర్గుల రామకృష్ణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని బొటానికల్ గార్డెన్ లో బట్టతలతో కనిపించిన ఒక కాకి సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ కాకిని చూసిన పలువురు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మిడీయాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఆ సందేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? అసలు కారణాలు ఇవే!:

ఇక కాకి బట్టతల అంశంపై బొటానికల్ గార్డెన్ సమన్వయకర్త డా. బి. సదాశివయ్య పూర్తి వివరాలు వెల్లడించారు. కాకుల్లో బట్టతల కనిపించడానికి ప్రధాన కారణం మోల్టింగ్ అనే సహజ ప్రక్రియ అని చెప్పారు. ఈ సమయంలో పాత ఈకలు రాలిపోయి, వాటి స్థానంలో కొత్త ఈకలు పెరుగుతాయి. ఈ కొత్త ఈకలు పూర్తిగా పెరిగే వరకు తల లేదా మెడ భాగం బట్టతలగా కనిపిస్తుంది. ఇది సహజమేనని సదాశివయ్య చెప్పారు. అయితే అన్ని సందర్భాల్లో ఇదే కారణం కాకపోవచ్చని తెలిపారు. పరాన్నజీవులు, శిలీంద్రాలు, వైరస్ లు ముఖ్యంగా ఏవియన్ పాక్స్ వంటి వ్యాధులు, పోషకాహార లోపం, కాలుష్యం, ఇతర కాకులతో జరిగే పోరాటాలు లేదా గాయాలతోనూ ఈకలు ఊడిపోయే అవకాశం ఉందని డా, సదాశివయ్య చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి



మూఢనమ్మకాలను నమ్మకండి!:

బట్టతలతో కనిపించే కాకిని చూసి భయపడాల్సిన అవసరం లేదని, అపశకునంగా భావించడం కేవలం మూఢనమ్మకమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రకృతిలో జరిగే సహజ మార్పులను శాస్త్రీయ దృష్టితో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఏది ఏమైన బట్టతల కాకి కనిపించడంతో అందరూ ప్రత్యేకంగా దానిని ఆసక్తిగా తిలకించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *