తాజావార్తలు

iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!

iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!


తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిత్యం ప్రజలతో మమేకమవుతుంటారు. ఇటీవల ఒక సమావేశంలో ఆయనను సహాయం కోసం ఒక మహిళ ఆశ్రయించారు. తన వద్దకు వచ్చిన ఆమెకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పెద్ద దానకర్ణుడని, అన్నీ ఆయనే చూసుకుంటారని, ఆమెను రాజగోపాల్ రెడ్డి వద్దకు వెళ్లాల్సిందిగా సూచించారు. తన వద్ద పైసలు లేనే లేవని, తాను ప్రభుత్వ క్వార్టర్లలో నివాసం ఉంటున్నానని మంత్రి తెలిపారు. రాజగోపాల్ రెడ్డి లాంటి దానకర్ణుడు ఉండగా తాను ఏం చేయగలనని సరదాగా వ్యాఖ్యానించారు.  మంత్రి మాటలపై అక్కడున్నవారు నవ్వుకున్నారు. మొత్తంగా, ఆర్థిక సహాయం కోసం వచ్చే వారిని తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి వద్దకు పంపుతూ, ఆయనను గొప్ప దాతగా అభివర్ణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *