తాజావార్తలు

Gold: పేపర్లలోని బంగారం రేటుకు, దుకాణాల్లోని రేటుకు మధ్య తేడా ఎందుకుంటుంది..? అసలు విషయమిదే..

Gold: పేపర్లలోని బంగారం రేటుకు, దుకాణాల్లోని రేటుకు మధ్య తేడా ఎందుకుంటుంది..? అసలు విషయమిదే..


బంగారం ధరలు తగ్గాయి లేదా పెరిగాయి అనే వార్తలు మనం తరచూ వింటూ ఉంటాం. ఎప్పుడైనా బంగారం కొనుగోలు చేయాలనుకున్నప్పుడు పేపర్లు, వెబ్‌సైట్లలోని ధరలు పరిశీలించి షాపుకు వెళతాం. కానీ షాపుల్లో ధరలు వేరుగా ఉంటాయి. పేపర్లలో వచ్చిన ధరలకు భిన్నంగా ఉంటాయి. దీంతో ధరల్లో మార్పులను గమనించి ఆశ్చర్యపోతుంటారు. అయితే టీవీలో, పేపర్లలో వచ్చే ధరలకు, షాపుల్లోని రిటైల్ ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. వెబ్ సైట్లు, పేపర్లు, టీవీలలో వచ్చేవి కమోడిటీ మార్కెట్లోని ముడి లోహం ధరలను సూచిస్తాయి. కానీ షాపుల్లో, షోరూముల్లో రిటైల్ ధరలు మరోలా ఉంటాయి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే బంగారు ఆభరణాలుగా మార్చడానికి మేకింగ్ ఛార్జీలు, దుకాణాదారుడి లాభాల మార్జిన్ లాంటివి ఉంటాయి. దీంతో పేపర్లలోని బంగారం ధరలకు, షాపుల్లోని ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉంటుంది.

వెండి ధరల్లో తేడాలు ఎందుకుంటాయి..?

ఇక వెండి ధరల విషయానికొస్తే.. ముడి రూపంలో కొనుగోలు చేసి దానిని వస్తువుల రూపంలో మార్చితే కొంత నష్టం జరుగుతుంది. వెండి వస్తువులను తయారుచేస్తే కటింగ్ సమయంలో కొంత మొత్తం పొడి రూపంలో పోతుంది. దీంతో షాపులవారు తరుగు రూపంలో కొంత శాతం కలిపి ధర ఫిక్స్ చేస్తారు. పేపర్లు, టీవీలు, వెబ్ సైట్లలో 99.9 శాతం ప్యూరిటీ ధరలను పేర్కొంటారు. కానీ షాపుల్లో విక్రయించేవి 92.5 శాతం ప్యూరిటీని మాత్రమే కలిగి ఉంటాయి. వీటిని స్టెర్లింగ్ సిల్వర్ అని పిలుస్తారు. వెండి వస్తువులను తయారుచేశాక ఇతర ఛార్జీలను కలిపిన తర్వాత మార్కెట్ ధరలతో పోలిస్తే షాపుల్లో ధరలు ఎక్కువగా ఉంటాయి. దీంత వెండి నాణ్యతను బట్టి ధరలు మారుతూ ఉంటాయి. వెండిలో 80 శాతం సిల్వర్‌తో పాటు 20 శాతం లోహలు ఉంటాయి. ఇతర లోహలను కలపడం వల్ల ధరలు పెరుగుతాయి.

వెండి వస్తువులపై 3 శాతం జీఎస్టీ

ఇక వెండి వస్తువులపై 3 శాతం జీఎస్టీ ఉంటుంది. దీంతో పేపర్లలో వచ్చిన ధరలతో పోలిస్తే షాపుల్లో ధరలు పెరుగుతూ ఉంటాయి. ఇక షోరూములు, దుకాణాల్లో ధరలు ఎక్కువగా ఉండటానికి మరోక కారణం రవాణా ఛార్జీలు, భద్రతా ఖర్చులు కూడా ఒక కారణం. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు ప్రతీ సెకన్‌ను మారుతూ ఉంటాయి. భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి. లైవ్ ట్రేడింగ్‌లో ధరలు మారుతూ ఉంటాయి. కానీ దేశీయ బులియన్ అసోసియేష్ ప్రతినిధులు ప్రతీ రోజు ఉదయం ఒక ధరను నిర్ణయిస్తారు. దీంతో షాపుల్లో ఈ ధర ఉంటుంది. ఇక వెండిని విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉంటారు. ఇక దిగుమతి సుంకం, సెస్ అన్నీ కలుపుకుంటే ధర పెరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *