బ్లడ్ షుగర్ నియంత్రణ, ఇమ్యూనిటీ: డయాబెటిస్ ఉన్నవారికి అల్లం నీరు ఎంతో మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి తోడ్పడుతుంది. అలాగే, అల్లంలోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity) పటిష్టం చేస్తాయి. దీనివల్ల వాతావరణ మార్పుల వల్ల వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్లు దరిచేరవు.
