తాజావార్తలు

Peddi Mega Event: రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు వచ్చినా రాకపోయినా మీ మనసులు గెలిచాడు అది చాలు: చిరంజీవి

Peddi Mega Event: రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు వచ్చినా రాకపోయినా మీ మనసులు గెలిచాడు అది చాలు:  చిరంజీవి


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. జూన్ 04న విడుదలైన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఏకంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో మంగళవారం (జూన్ 23) హైదరాబాద్ శిల్పకళా వేదికగా పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ తో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తోటి నటుడిగా రామ్ చరణ్‌ను చూసి అభినందిస్తున్నాను.. అన్ని విభాగాల్లోనూ పరిపక్వత చూపించారు. తండ్రిగా గర్విస్తున్నాను. రంగస్థలం లాంటి సబ్జెక్టులు మళ్లీ మళ్లీ రావు. ఆర్టిస్టుగా చిరస్థాయిగా నిలిచే సినిమాలు తక్కువగా వస్తుంటాయి. మగధీర, ట్రిపుల్ ఆర్, రంగస్థలం తర్వాత ఇంత తక్కువ గ్యాప్‌లో పెద్ది లాంటి సినిమా వస్తుందని అనుకోలేదు. చరణ్ సినిమా అని కూర్చున్నా.. మాకు పెద్ది స్క్రీన్ మీద కనిపించాడు. కథను కఠోరంగా నమ్మి ముందుకెళ్లాడు కాబట్టే అంత బాగా నటించగలిగాడు.. ఈ సినిమాలో చరణ్ సంతోషపెట్టాడు.. బాధ పెట్టించాడు.. ఏడిపించాడు.. విజయం సాధించాడు. ఆర్టిస్టులు వాళ్లు ఓన్ చేసుకోవాలి తప్ప.. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో రక్తి కట్టించాలనుకోవడం కరెక్ట్ కాదు.. లోపల ఉన్న ఫీల్‌ను వాళ్లు ఫీల్ అవుతూ కళ్ల ద్వారా నటించినపుడే పరిపక్వత ఉన్న నటన.. ఇప్పుడు రామ్ చరణ్ అలా చేసాడు. చరణ్ ఒక స్టార్ కొడుకు..వాడికి ఇంత అవసరం లేదు.. జస్ట్ అలా మెకానికల్‌గా చేసి వెళ్లొచ్చు కానీ అలా చేయలేదు’

‘రంగస్థలానికే అవార్డు వస్తుందని నాతో సుకుమార్ చాలా సార్లు చెప్పారు కానీ రాలేదు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటున్నారు. అవార్డు వచ్చినా రాకపోయినా మీ మనసులు గెలిచాడు అది చాలు. నేషనల్ అవార్డ్ రావడానికి చాలా మార్గాలుంటాయి.. కానీ పెద్దికి మనసు గెలిచే పర్పార్మెన్స్ ఇచ్చాడు. ఓరోజు షూట్‌లో కన్నుకు చాలా పెద్ద దెబ్బ తగిలింది.. కన్నే పోవాల్సింది.. ప్రమాదం లేదని తెలిసి హమ్మయ్య అనుకున్నాం. ఇలాంటివి చూసినపుడు నటుడిగా చాలా గర్వపడతాను. గూండా సినిమా సమయంలో ట్రైన్ కింద రాడ్ పట్టుకుని వెళ్లాను.. నాన్నగారు చూసి కంగారు పడ్డారు.. ఇలాంటి షాట్స్ నీకు అవసరమా అన్నారు. నీకు కొడుకు పుడితే.. రేపు వాడు కూడా ఇలాగే కష్టపడితే దెబ్బలు తగిలితే అప్పుడు తెలుస్తుంది అన్నాడు.. ఇప్పుడు అర్థమవుతుంది. కష్టపడ్డాడు.. ఏదీ షార్ట్ కట్‌గా రాదు.. ఈరోజుకు కూడా మేం కష్టపడుతున్నాం. ఇప్పట్నుంచి చిరంజీవి కాదు.. చరణ్ జీవి. రామ్ చరణ్ ఇప్పుడు న్యూ ఏజ్ మెగాస్టార్ అన్నారు నరేంద్ర మోడీగారు. పెద్ది తర్వాత పూర్తిస్థాయిలో పుత్రోత్సాహం ఫీల్ అవుతున్నాను’ అని చెప్పుకొచ్చారు చిరంజీవి.

ఇవి కూడా చదవండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *