ఇంటి గార్డెన్‌లో పెంచుకునే పవిత్రమైన మొక్కల్లో అపరాజిత (Butterfly Pea) ఒకటి. శంఖు ఆకారంలో ఉండే ఈ నీలి రంగు పూలు పూజా అవసరాలకే కాకుండా, ఆరోగ్యానికి మేలు చేసే బ్లూ టీ తయారీకి కూడా ఉపయోగపడతాయి. అయితే చాలామంది ఇళ్లలో ఈ మొక్క సరిగ్గా పెరగకపోవడం లేదా పూలు పూయకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అపరాజిత మొక్కకు ఎక్కువ మొగ్గలు తొడిగి, కుండీ నిండా పూలు పూయాలంటే ఎలాంటి ఎరువులు వేయాలి, నీరు ఎంత పరిమాణంలో పోయాలి, పించింగ్ పద్ధతిని ఎలా ఉపయోగించాలో వంటి కొన్ని సులభమైన హోమ్ గార్డెనింగ్ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
