కొత్తిమీర దీని గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రతి కూరల్లో దీనిని వాడుతుంటారు. కొత్తి మీరను వంటకాల్లో ఉపయోగించడం వలన వంటలకు అద్భుతమైన రుచి వస్తుంది. అంతే కాకుండా మంచి రంగులోకి మారుతుంది అని చెబుతుంటారు.
ఇక కొత్తిమీర ఒక్కటే కాకుండా, దీని విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా వంటకాల్లో కూడా కొత్తిమీర గింజలను పౌడర్ చేసుకుంటారు. ఇది ప్రతి వంటకానికి మంచి రుచిని ఇస్తుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది
అయితే చాలా మంది కొత్తిమీరను రుచి కోసమే వంటల్లో ఉపయోగిస్తారు అనుకుంటారు. కానీ దీనిని వంటల్లో ఉపయోగించి తినడం వలన వెలకట్టలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో ప్రోటీన్, మంచి కొవ్వులు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్స్ వంటివి ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా విటమిన్ సి, పొటాషియం, వంటివి కూడా అధిక మొత్తంలో ఉన్నాయి.
అందువలన దీనిని వంటల్లో ఉపయోగించుకోవడం వలన జీర్ణసమస్యలను తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మధుమేహం వ్యాధి గ్రస్థులకు ఇది చాలా మంచిది. దీనిని వంటల్లో వేసుకొని తినడం వలన ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది.
అంతే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కిడ్నీ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. చిన్న కొత్తిమీర వలన ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి, దీనిని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు. అలాగే చాలా మంది రుచి కోసం కూడా దీనిని ఉపయోగిస్తారు. నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.





