తాజావార్తలు

మహిళ చితాభస్మంలో కత్తెర.. అసలేం జరిగింది?

మహిళ చితాభస్మంలో కత్తెర.. అసలేం జరిగింది?


కఠినమైన చట్టాలున్నా, కళ్లు తెరవని అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదల ప్రాణాలు ఎలా గాల్లో కలిసిపోతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. డాక్టర్ అందుబాటులో లేడన్న నెపంతో ఒక నర్సు కత్తెర పట్టి ఆపరేషన్ థియేటర్‌లోకి దూరింది. ఆమె చేసిన అరకొర వైద్యం.. పురిట్లోనే ఒక పసిగుడ్డు ప్రాణాన్ని బలిగొనడమే కాకుండా, కన్నతల్లిని కూడా చితిపైకి చేర్చింది. తీరా అంత్యక్రియలు ముగిశాక ఆ తల్లి చితాభస్మంలో కత్తెర బయటపడటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. భద్రాద్రి జిల్లా గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన మమత అని పిలుచుకునే చాట్ల వనజ అనే గర్భిణి జూన్‌ 13న ప్రసవం కోసం గుండాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. అయితే ఆ సమయంలో అక్కడ కనీసం ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. డెలివరీ సమయం దాటిపోతుండటంతో, అక్కడ ఉన్న నర్స్‌ తానే సర్వస్వం అన్నట్లు కత్తెర పట్టి ఆపరేషన్‌ చేసేసింది. నర్సు చేసిన ఈ నిర్వాకం వల్ల పుట్టిన శిశువు పురిట్లోనే ప్రాణాలు కోల్పోయింది. అటు బాలింత పరిస్థితి కూడా విషమించడంతో వెంటనే కొత్తగూడెం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆ తల్లి కూడా కన్నుమూసింది. ఒకే రోజు తల్లీబిడ్డలిద్దరూ శవాలుగా మారడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నిండిపోయింది. బాధాకరమైన విషయమేమిటంటే, అదే రోజు స్వగ్రామంలో తల్లీబిడ్డలకు అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. అంత్యక్రియల అనంతరం బంధువులు వనిత చితాభస్మం సేకరిస్తుండగా, అక్కడ కాలిన ‘సర్జరీ కత్తెర’ బయటపడింది. ఆపరేషన్ చేసిన నర్సు నిర్లక్ష్యంగా కత్తెరను బాలింత కడుపులోనే వదిలేసి కుట్లు వేసేసిందని, ఆ కారణంగానే తీవ్ర రక్తస్రావమై ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తూ ఆరోపిస్తున్నారు. అయితే వైద్యాధికారులు మాత్రం అక్కడ సాధారణ ప్రసవమే జరిగిందని, ఎలాంటి శస్త్రచికిత్స చేయలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర సమయాల్లో వైద్యులు అందుబాటులో ఉండకపోవడం, అర్హత లేని సిబ్బంది ఆపరేషన్లు చేయడం లాంటి దారుణాలు ఇంకెంతమంది ప్రాణాలను బలితీసుకుంటాయి? బాధ్యులైన నర్సు, అక్కడి వైద్య సిబ్బందిపై కఠినమైన విచారణ జరిపి, హత్య కేసు నమోదు చేయాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

OTT గైడ్! వావ్.. 16 పైగా సినిమాలు స్ట్రీమింగ్‌కి

Samantha: సమంత పిల్లి పేరు వెనకాల.. ఓ జ్ఙాపకం.. ఓ కష్టం.. ఓ కన్నీటి కథ ఉంది తెలుసా?

Klin Kaara: ఫైనల్‌గా క్లీంకారను చూపించిన చరణ్‌

హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై షాకింగ్ సీన్.. స్పోర్ట్స్‌ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు!

నిండా ముంచిన ఇన్‌స్టా ప్రేమ.. లక్షల్లో నగదు, గోల్డ్‌ కొట్టేసిన కేటుగాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *