ఢిల్లీ మెట్రో రైళ్లు కేవలం ప్రయాణానికే కాదు, వివాదాలకు, వింత సంఘటనలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. డ్యాన్స్‌లు, గొడవలు, వింత దుస్తులతో వార్తల్లో నిలిచే ఢిల్లీ మెట్రోలో తాజాగా ఒక షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. ఈసారి ఏ మనుషులో కాదు, ఏకంగా ఒక కోతి మెట్రో కోచ్‌లోకి దూరి ప్రయాణికులకు చుక్కలు చూపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది.
మెట్రోలో కోతి ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు..?
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. రద్దీగా ఉన్న ఢిల్లీ మెట్రో కోచ్‌లోకి ఒక కోతి అకస్మాత్తుగా ప్రవేశించింది. మొదట సీట్లపై నడుస్తూ వెళ్లిన ఆ కోతి, అక్కడ కూర్చున్న ఒక యువతి వైపు వెళ్ళింది. అంతటితో ఆగకుండా ఆ యువతి ముఖానికి దగ్గరగా వెళ్లి ముద్దు పెట్టడానికి (Kissing) ప్రయత్నించినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ కోతి చర్యకు సదరు యువతి తీవ్ర భయాందోళనకు గురైంది. ఆ తర్వాత కోతి అక్కడి ప్రయాణికులపైకి దూకడానికి ప్రయత్నిస్తూ వారిని భయపెట్టింది. కోతిని చూసి కోచ్‌లోని ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేస్తూ, అటు ఇటు పరుగులు తీశారు.
ఇవి కూడా చదవండి
నెటిజన్ల రియాక్షన్:
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేసిన కొద్దిసేపటికే మిలియన్ల కొద్దీ వ్యూస్‌ని (Views) సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఢిల్లీ మెట్రోలో రోజుకో వింత చూడాల్సి వస్తోంది అని ఫన్నీగా కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఇది చాలా ప్రమాదకరమైన విషయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతి కనుక ప్రయాణికులపై దాడి చేసి కరిచి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
दिल्ली मेट्रो की पिंक लाइन (सराय काले खां स्टेशन) पर आज गजब ही हो गया! 🚊🐒
एक ‘बंदर भाई’ बिना टिकट फुल स्वैग में सफर कर रहे थे। हद तो तब हो गई जब वो सीधे एक लड़की की गोद में जा बैठे और उसे ‘किस’ (Kiss) भी कर दिया!
सहयात्री डर के साए में सफर करने को मजबूर थे।मनोरंजन अपनी जगह… pic.twitter.com/3kQdeDgqoS
— KK Delhi (@Surya102m) June 19, 2026
భద్రతపై ప్రశ్నలు:
ఈ ఘటన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) భద్రతా ఏర్పాట్లపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. అంతటి కఠినమైన సెక్యూరిటీ, ఆటోమేటిక్ తలుపులు ఉండే మెట్రో స్టేషన్లలోకి, కదిలే రైలు కోచ్‌ల్లోకి కోతి ఎలా ప్రవేశించిందనేది మిస్టరీగా మారింది. గతంలో కూడా మెట్రో ప్రాంగణాల్లో కోతులు తిరిగిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి వన్యప్రాణులు మెట్రోలోకి రాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
