తాజావార్తలు

Hyper Aadi: చివరకు లేడీస్ హాస్టల్‌లో తలదాచుకోవాల్సి వచ్చింది.. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కామెంట్స్ వైరల్

Hyper Aadi: చివరకు లేడీస్ హాస్టల్‌లో తలదాచుకోవాల్సి వచ్చింది.. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కామెంట్స్ వైరల్


Hyper Aadi: చివరకు లేడీస్ హాస్టల్‌లో తలదాచుకోవాల్సి వచ్చింది.. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కామెంట్స్ వైరల్

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కమెడియన్ హైపర్ ఆది కూడా ఒకరు. తనదైన కామెడీ పంచులు, ప్రాస లు వేస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారయన. తన ట్యాలెంట్ తో జబర్దస్త్ లో టీమ్ లీడర్ దాకా ఎదిగిన ఆది ఇప్పుడు సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. అయితే అప్పుడప్పుడు జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి టీవీ షోల్లోనూ సందడి చేస్తుంటారు. అలాగే రెగ్యులర్ గా ఢీ లో కనిపిస్తుంటారు. అయితే తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన ఆది తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే సందర్భంలో కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను గుర్తు తెచ్చుకుని బాగా ఎమోషనల్ అయ్యారు

‘మాది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒకప్పుడు మా కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. చిన్న అవసరానికి కూడా ఇతరులపై ఆధారపడాల్సి వచ్చేది. కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నప్పటికీ ఉద్యోగాలు రాలేదు. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ నా భుజాల పైనే పడ్డాయి. మా నాన్న మా చదువుల కోసం ఎన్నో అప్పులు చేశారు. ఆ అప్పులు ఎలా తీర్చాలో కూడా నాకు అర్ధమయ్యేది కాదు. ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చినా అప్పుడు నా నెల జీతం కేవలం రూ. 20 వేలు మాత్రమే. ఆ డబ్బు కేవలం వడ్డీలు కట్డడానికి మాత్రమే సరిపోయేది. అయితే నటనపై ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాను. జాబ్ లేకపోవడంతో నా ఫ్యామిలీ పరిస్థితి మరింత దిగజారింది. హైదరాబాద్ లో కనీసం హాస్టల్ ఫీజు కట్టే పరిస్థితి కూడా లేదు. అప్పుడు మా రిలేటివ్స్ లో ఒకరు హైదరాబాద్‌లో హాస్టల్ నిర్వహించేవారు. నా పరిస్థితి చూసి అక్కడ ఫ్రీగా ఉండమన్నారు. అయితే అది లేడీస్ హాస్టల్. అక్కడ ఒక చిన్న గదిలో తలదాచుకుని రోజులు గడిపాను. జీవితంలో ఆ రోజులు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను’ అంటూ బాగా ఎమోషనల్ అయ్యారు ఆది. ప్రస్తుతం ఈ జబర్దస్త్ నటుడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

హైపర్ ఆది ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by Jabardasth Hyper Aadi (@hyper.aadi)

 

View this post on Instagram

 

A post shared by Jabardasth Hyper Aadi (@hyper.aadi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *