తాజావార్తలు

Trending Song : 16 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్.. ప్రేమ వేదన.. ఆ పాట రహస్యం ఇదే..

Trending Song : 16 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్.. ప్రేమ వేదన.. ఆ పాట రహస్యం ఇదే..


మణిరత్నం దర్శకత్వంలో, ఏ.ఆర్. రెహమాన్ సంగీత సారథ్యంలో వచ్చిన ‘రావణన్’ (తెలుగులో ‘విలన్’) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. 2010లో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేయగా ఊహించని స్థాయిలో సంచలనం సృష్టించింది. అయితే ఈ చిత్రంలోని పాటలు అద్భుతమైన ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘ఉసురే పోగుదే’ తెలుగులో ఉసురే పోయేనే పాట వినగానే మనసును హత్తుకుంటుంది. ఈ పాటలోని సాహిత్యం గురించి, ముఖ్యంగా అందులో కవి వైరముత్తు వాడిన “తగైవిలాన్ కురువి” (Thagaivilan Kuruvi) అనే పదం వెనుక ఉన్న లోతైన అర్థం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పాట ఒక విభిన్నమైన ప్రేమకథను ప్రతిబింబిస్తుంది. ఒకవైపు ప్రేమను వ్యక్తపరుస్తూనే, మరోవైపు ఆ ప్రేమలోని నైతికతను, దూరాన్ని కూడా కవి చాలా జాగ్రత్తగా కవిత్వీకరించారు. విక్రమ్, ఐశ్వర్యారాయ్ పాత్రల మధ్య ఉన్న భావోద్వేగాలను, వారి మధ్య ఉన్న దూరాన్ని వైరముత్తు తన కలంతో చాలా అద్భుతంగా చిత్రీకరించారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : ఏం పాట రా బాబు.. అప్పట్లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.. ఇప్పటికీ ట్రెండింగ్ ఈ సాంగ్..

ఈ పాటలో వచ్చే “తగైవిలాన్ కురువి ఎన్నై తళ్ళి నిన్ను సిరిక్కుదడి” (తగైవిలాన్ పక్షి నన్ను దూరంగా నిలబడి చూసి నవ్వుతోంది) అనే చరణం చాలా ప్రత్యేకం. సాధారణంగా పక్షుల గురించి చెప్పేటప్పుడు ఎన్నో రకాలను పేర్కొనవచ్చు, కానీ వైరముత్తు ప్రత్యేకంగా ఈ పక్షిని ఎందుకు ఎంచుకున్నారంటే.. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ‘తగైవిలాన్ కురువి’ అనే పక్షి భూమిపైకి దిగకుండా, ఆకాశంలోనే నిరంతరం ఎగురుతూ ఉంటుందట. ప్రేమలో ఉన్న ప్రేమికులిద్దరి మధ్య ఎంతటి దూరం ఉందో, వారిద్దరి ప్రపంచాలు ఎంత భిన్నంగా ఉన్నాయో చెప్పడానికి కవి ఈ పక్షిని ఒక రూపకంగా (Metaphor) ఉపయోగించారు. ఆ పక్షి ఆకాశంలో ఎలాగైతే ఎప్పటికీ అందుబాటులోకి రాదో, ఆ ప్రేమికులిద్దరి మధ్య ఉన్న దూరం కూడా అంతే అని, వారి ప్రేమ కలవలేనిది అని చెప్పడమే ఈ ప్రయోగం వెనుక ఉన్న అసలు రహస్యం.

ఎక్కువ మంది చదివినవి : Naga Chaitanya : అప్పుడు నాగార్జున జోడిగా.. ఇప్పుడు నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే..

తెలుగు, తమిళ భాషల్లో సాహిత్యానికి, అర్థానికి కవులు ఇచ్చే ప్రాధాన్యతకు, పదాల ఎంపికలో వారు చూపే జాగ్రత్తకు ఈ పాట ఒక నిదర్శనం. ఒక చిన్న పక్షి ద్వారా ప్రేమలోని వేదనను, అసాధ్యమైన దూరాన్ని వైరముత్తు ఎంతో గాఢంగా ఆవిష్కరించారు. ఈ భూమిలోన ఎప్పుడంట నీ పుటక.. నా బుద్ధిలోన నువ్వు చిచ్చు పెట్టాక”.. “ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా.. ఈ అగ్గిపుల్ల తానింత చిన్నదైనా” అంటూ సాగే ఈ పాట తెలుగులోనూ మంచి విజయం సాధించింది.

ఎక్కువ మంది చదివినవి : పెళ్లి ఫంక్షన్లలో పని.. రూ.500 జీతం కోసం ఎన్నో కష్టాలు.. కట్‌చేస్తే టాలీవుడ్ క్వీన్..

ఉసురే పోయేనే సాంగ్ వీడియో చూడండి..



ఎక్కువ మంది చదివినవి : దాసరి, చిరంజీవి చేతుల మీదుగా అవార్డ్ అందుకుంటున్న నటుడిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు జబర్దస్త్ షోలో ఫేమస్ కమెడియన్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *