తాజావార్తలు

Viral: టీ తాగుదామని బైక్ ఆపాడు.. వచ్చి బండి చూస్తే గుండె ఆగినంత పనైంది..

Viral: టీ తాగుదామని బైక్ ఆపాడు.. వచ్చి బండి చూస్తే గుండె ఆగినంత పనైంది..


హోటల్‌లో టీ తాగి తిరిగి వెళ్లేందుకు బైక్ స్టార్ట్ చేయబోయిన ఓ వ్యక్తి బైక్ ను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. బైక్ ఇంజిన్ భాగంలో ఏదో అలికిడి వినిపించి భయాందోళనకు గురయ్యాడు. బైకర్ ఎందుకు భయపడ్డాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. సూర్యాపేటలో టీ తాగేందుకు కేఫ్ ఎదురుగా బైక్ ను పార్క్ చేశాడు. టీ తాగి తిరిగి వెళ్లేందుకు బైకును స్టార్ట్ చేసే ప్రయత్నంలో బైక్ ఇంజన్ లో కనిపించిన కట్ల పామును చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. బైక్ లో దాక్కున్న పాము ఎంతకీ బయటకు రాకపోవడంతో బైక్ యజమాని తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు పామును బయటకు రప్పించేందుకు ప్రయత్నించగా అది మరింత లోపలికి వెళ్లిపోయింది. బైక్ స్టార్ట్ చేసి ఇంజిన్ స్పీడ్ పెంచినా.. బైక్ లోపలికి నీళ్ళు కుమ్మరించినా.. పాము చాలా సమయం వరకు బయటకు రాలేదు.

చివరకు పామును బయటకు తీసేందుకుబయటకు బైక్‌లోని కొన్ని భాగాలను తొలగించి.. గంటపాటు రెస్క్యూ చేశారు. బైక్ ను కిందకు వంచగా బయటకు వచ్చిన పాము పక్కనే ఉన్న మరో బైక్‌లోకి దూరింది. దీంతో పాము ఎప్పుడు బయటకు వచ్చి ఎవరిపై దాడి చేస్తుందోనన్న స్థానికులు ఆందోళన చెందారు. చివరకు రెండో బైక్‌లో ఉన్న పామును బైక్ సీటు తొలగించి కర్రల సహాయంతో బయటకు తీసి కొట్టి చంపారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

రద్దీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో కొంతసేపు ప్రజలు గుమిగూడగా కాసేపు హైటెన్షన్ ఏర్పడింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో పాముల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *