తాజావార్తలు

TS Inter Supplementary Results: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

TS Inter Supplementary Results: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల


TS Inter Supplementary Results 2026: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు (TGBIE) నేడు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసింది. మే, జూన్ నెలల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు హాజరైన జనరల్, ఒకేషనల్ స్ట్రీమ్ విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.

పరీక్షా ఫలితాల ప్రకటన ముగిసిన వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్థం మార్కుల వివరాలను అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతారు. కింద పేర్కొన్న వెబ్‌సైట్ల ద్వారా విద్యార్థులు తమ మార్కులను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ల ద్వారా రిజల్డ్ తెలుసుకోవచ్చు. tgbie.cgg.gov.in, results.cgg.gov.in

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

విద్యార్థులు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ నుండి తమ తెలంగాణ బోర్డ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు 2026ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది దశలను అనుసరించాలి.

  • TGBIE అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in ను సందర్శించండి.
  • హోమ్‌పేజీలో, ‘TG Inter 1st/ 2nd year supply result 2026’ పై క్లిక్ చేయండి.
  • హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి లాగిన్ అవ్వండి.
  • సబ్మిట్ చేయగానే, మార్క్‌షీట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీనిని ప్రింట్‌ తీసుకోవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *