తాజావార్తలు

Super Star Krishna: మహేష్ ఆ క్యారెక్టర్ వేస్తే చాలా స్టైలీష్‏గా ఉంటాడు.. సూపర్ స్టార్ కృష్ణ మనసులోని మాటలు..

Super Star Krishna: మహేష్ ఆ క్యారెక్టర్ వేస్తే చాలా స్టైలీష్‏గా ఉంటాడు.. సూపర్ స్టార్ కృష్ణ మనసులోని మాటలు..


సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మలకు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అందులో మహేష్ బాబు గురించి కృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అందులో విజయనిర్మల మహేష్ బాబుని డైరెక్ట్ చేయాలనే తన ఆకాంక్షను వెల్లడించారు. “మహేష్‌ను డైరెక్ట్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఆయన పెద్ద హీరో కదా,” అని ఆమె అన్నారు. తాను పరిశ్రమకు వచ్చినప్పుడు కృష్ణ తో సమాన స్థాయిని పంచుకున్నానని, “ఆయన కొత్త, నేను కొత్త కాబట్టి డైరెక్ట్ చేసేసాను” అని గుర్తు చేసుకున్నారు. అయితే, ఇప్పుడు మహేష్ పెద్ద హీరో కాబట్టి, “పెద్ద బడ్జెట్ కూడా కావాలి. కాబట్టి కొంచెం సమయం పట్టొచ్చు” అని ఆమె వివరించారు

ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..

సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ, మహేష్‌ను ఛత్రపతి శివాజీ పాత్రలో చూడాలనే తన కోరికను రెండుసార్లు వ్యక్తం చేశారని, అది ఇప్పటికీ కొనసాగుతోందని తెలిపారు. స్వయంగా తాను అన్ని రకాల పాత్రలను – బాండ్, కౌబాయ్, పౌరాణికాలు – పోషించానని, తనకు ఇంకే పాత్రలు చేయాలనే కోరిక మిగలలేదని కృష్ణ స్పష్టం చేశారు. మహేష్ బాండ్ క్యారెక్టర్ చేస్తే చాలా బాగుంటుందని, స్టైలిష్‌గా ఉంటారని ఆయన సూచించారు. “బాండ్ చేస్తే బాండ్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది బాబుకి” అని కృష్ణ అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..

ప్రస్తుతం పరిశ్రమలో జేమ్స్ బాండ్ లాంటి సినిమాలు తీయడానికి ఉన్న అవకాశాలపై చర్చించగా, “టెక్నికల్‌గా ఇప్పుడు హాలీవుడ్‌తో ఈక్వల్‌గా మనకు ఫెసిలిటీస్ వచ్చినయి, గ్రాఫిక్స్ వచ్చినయి. డెఫినెట్‌గా తెలుగు సినిమా బడ్జెట్‌లోనే బాండ్ పిక్చర్ తీయొచ్చు” అని కృష్ణ చెప్పారు. సాంకేతిక పురోగతి వల్ల తెలుగు సినిమా ఇలాంటి ఉన్నత స్థాయి ప్రాజెక్టులను చేపట్టగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Sirivennela Sitaramasastri : మనిషి జీవితంలో ఎదగటానికి ఈ లక్షణాలు ఉంటే చాలు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి..

ఎక్కువ మంది చదివినవి : Vadde Naveen: ఒకప్పుడు లవర్ బాయ్.. వడ్డె నవీన్ కొడుకును చూశారా.. ? వైరలవుతున్న ఫోటోస్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *