Royal Challengers Bengaluru vs Gujarat Titans Result, IPL Final 2026: ఈ ఉత్కంఠభరిత పోరులో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ ఒక మోస్తరు స్కోరుకే పరిమితమైంది. అనంతరం 156 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే మ్యాచ్ను తన వైపు తిప్పుకుంది.
