తాజావార్తలు

ముచ్చింతల్‌లో శ్రీసుదర్శన మహామంత్ర హోమం.. ప్రత్యక్ష ప్రసారం..

ముచ్చింతల్‌లో శ్రీసుదర్శన మహామంత్ర హోమం.. ప్రత్యక్ష ప్రసారం..


ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్పూర్తి కేంద్రం.. దివ్యసాకేత క్షేత్రంలో శనివారం నుంచి (30-5-2026) 9-6-2026 వరకు శ్రీసుదర్శన మహామంత్రహోమం జరుగనుంది.. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో.. పర్యవేక్షణలో పూజలు ప్రతిరోజు ఉదయం 6.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు హోమాలు, పారాయణాలు జరుగుతాయి.. అయితే.. ఏ రోజైనా ప్రత్యక్షంగ కూడా ఉచితంగా పాల్గొనవచ్చు. దీనికి ఎలాంటి రుసుమేమి లేదు..

శనివారం ఉదయాన్నే . శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి ఆధ్వర్యంలో శ్రీసుదర్శన మహామంత్రహోమం జరుగుతోంది. ప్రచండ భానుడి ప్రతాపం నుంచి అంతా సురక్షితంగ, ఆరోగ్యంగ ఉండాలని, దేశం, ప్రజలు అందరూ శాంతి, సంతోషాలతో, సంపదలతో జీవితం సాగించాలని భగవద్రామానుజుల శ్రీపాద సన్నిధిలో ప్రత్యేక హోమం నిర్వహిస్తున్నారు.

శ్రీసుదర్శన మహామంత్రహోమం లైవ్‌లో చూడండి..

సమతామూర్తి భగవద్రామానుజుల ప్రేరణతో ప్రజలంతా కలిసి జీవించాలని, ప్రస్తుత పరిస్థితులు సానుకూలంగ మారాలి, పరస్పర ప్రేమానురాగాలతో సహజీవనం సాగించాలని ఈ కార్యక్రమాన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, సమతామూర్తి స్పూర్తి కేంద్రంలో, దివ్యసాకేత క్షేత్రంలో 11 దినాల పాటు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *