తాజావార్తలు

పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..

పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..


బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నాన్ స్టాప్‌గా పరుగులు పెడుతున్నాయి.. ఇటీవల రేట్లు రికార్డు స్థాయికి చేరుకుని.. ఆ తర్వాత క్రమంగా దిగివచ్చాయి.. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, డిమాండ్ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజే 1600 మేర ధర పెరిగింది. అయితే.. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. శనివారం (మే 30, 2026 ) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 10 మేర పెరిగి, రూ.1,57,650 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 పెరిగి.. రూ.1,44,510 గా ఉంది.

వెండి కిలోపై రూ.100 మేర పెరిగి.. రూ.2,80,100 గా ఉంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

హైదరాబాద్‌లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,57,650, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,44,510 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,90,100 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,57,650, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,44,510 ఉంది. వెండి కిలో ధర రూ.2,90,100 ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *