
హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో ఎన్ హెచ్ 65పై పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టింది. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహన దారులు తాము సూచించే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకోవాలి. మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు నాగార్జునసాగర్, పెద్దవూర, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్‌కు రీచ్ అవ్వాలి. నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు మర్రిగూడ బై పాస్, మునుగోడు, నారాయణపూర్, చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటే సులభంగా ఉంటుంది. ఇక విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారి వాహనాలు కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి నుంచి మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకోవాలని పోలీసులు సూచించారు.
