Flop Players IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్‌లో ఐదుగురు స్టార్ బ్యాటర్లు ఘోరంగా విఫలమవుతున్నారు. మైదానంలో పరుగుల వరద పారించాల్సిన వీరు, ఇప్పుడు తమ జట్లకు పెద్ద తలనొప్పిగా మారారు. వీరి ఫామ్ లేమి కారణంగా జట్లు పరాజయాల పాలు కావడమే కాకుండా, ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకునే ప్రమాదంలో పడ్డాయి. జట్లు గెలవాలంటే ఈ ఆటగాళ్లను తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది.
1. నికోలస్ పూరన్ (లక్నో): లక్నో జట్టులో అత్యంత దారుణంగా ఆడుతున్న బ్యాటర్ నికోలస్ పూరన్. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఆయన కేవలం 82 పరుగులు మాత్రమే చేశాడు. ప్రతి మ్యాచ్‌లో అవకాశం వచ్చినా తన ఫామ్‌ను నిరూపించుకోలేకపోయాడు. లక్నో జట్టు ఆడిన 8 మ్యాచ్‌లలో 6 ఓడిపోయి పట్టికలో అట్టడుగున ఉంది. ప్లేఆఫ్ చేరాలంటే మిగిలిన 6 మ్యాచ్‌లలోనూ తప్పక గెలవాలి.
2. రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై): చెన్నై జట్టుకు పరుగుల యంత్రం వంటి రుతురాజ్ ఈ సీజన్‌లో వరుసగా విఫలమవుతున్నాడు. 8 మ్యాచ్‌లలో 25.42 సగటుతో కేవలం 178 పరుగులు మాత్రమే చేశాడు. గుజరాత్‌పై చేసిన 74 పరుగులు మినహాయిస్తే మిగిలిన మ్యాచ్‌లలో ప్రభావం చూపలేదు. చెన్నై ఇప్పటికే 5 మ్యాచ్‌లు ఓడిపోయింది. ప్లేఆఫ్ చేరాలంటే మిగిలిన 6 మ్యాచ్‌లలో 5 మ్యాచ్‌లు ఖచ్చితంగా గెలవాలి.
3. సూర్యకుమార్ యాదవ్ (ముంబై): ముంబై ఇండియన్స్ జట్టులో సూర్యకుమార్ యాదవ్ ఈసారి విలన్‌గా మారాడు. 8 మ్యాచ్‌లలో కేవలం 162 పరుగులు మాత్రమే చేశాడు. ఒకే ఒక అర్ధశతకం మినహా మిగిలిన ఇన్నింగ్స్‌లలో నిరాశపరిచాడు. ముంబై ఇప్పటికే 6 మ్యాచ్‌లు ఓడిపోయిన నేపథ్యంలో, మిగిలిన 6 మ్యాచ్‌లలోనూ గెలిస్తేనే వారికి ప్లేఆఫ్ బెర్తు దక్కుతుంది.
4. జితేష్ శర్మ (బెంగళూరు): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఫినిషర్‌గా బాధ్యతలు చేపట్టిన జితేష్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. 9 మ్యాచ్‌లలో కేవలం 9.00 సగటుతో 63 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఆర్‌సీబీ ఇప్పటికే 6 మ్యాచ్‌లు గెలిచి ఉండటంతో, మిగిలిన 5 మ్యాచ్‌లలో 2 గెలిస్తే సరిపోతుంది.
5. రిషబ్ పంత్ (లక్నో): లీగ్‌లోనే అత్యంత ఖరీదైన ఆటగాడైన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాట్ ఈసారి మూగబోయింది. 8 మ్యాచ్‌లలో 189 పరుగులు మాత్రమే చేశాడు. పంత్ వైఫల్యం జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. లక్నో ప్లేఆఫ్ చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌లలోనూ అద్భుతాలు చేయాల్సి ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
