తాజావార్తలు

NEET UG 2026 Dress Code: మరో రెండు రోజుల్లోనే నీట్‌ యూజీ 2026 పరీక్ష.. డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరి

NEET UG 2026 Dress Code: మరో రెండు రోజుల్లోనే నీట్‌ యూజీ 2026 పరీక్ష.. డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరి


హైదరాబాద్‌, మే 1: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌తో పాటు ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘నీట్‌ యూజీ 2026’ పరీక్షకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఈ పరీక్ష మే 3న దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఒకే షిఫ్ట్‌లో ఆఫ్‌లైన్‌ (పెన్‌, పేపర్‌) విధానంలో జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దేశవ్యాప్తంగా మొత్తం 22 లక్షలకుపైగా విద్యార్థులు నీట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది తెలంగాణ నుంచి 70 వేల మందికిపైగా విద్యార్థులు నీట్‌ పరీక్ష రాశారు. ఈసారి 75 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నీట్‌ యూజీ 2026 అడ్మిట్‌ కార్డులు ఏప్రిల్‌ 27 నుంచే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఎన్టీఏ అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎన్‌టీఏ పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది. ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లు, డ్రెస్‌ కోడ్‌ వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించవల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులు డ్రెస్‌ కోడ్ విధిగా పాటించాలి. పొడవు చేతులున్న డ్రెస్‌లు, మందంగా ఉండే దుస్తులు ధరించకూడదు. ఎలాంటి మెటల్‌ నగలు, వస్తువులకు పరీక్ష కేంద్రాలోకి అనుమతి లేదునిషేధిత వస్తువులు తీసుకొస్తే డిస్క్వాలిఫికేషన్‌ తప్పదని ఎన్టీయే హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

నీట్‌ యూజీ 2026 పరీక్షను పారదర్శకంగా, ఎలాంటి అవకతవ కలకు తావులేకుండా నిర్వహించేందుకు కీలక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మే 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు సెలవులు రద్దు చేశారు. గతంలో నీట్‌ పరీక్షల సందర్భంగా చోటుచేసుకున్న చీటింగ్, ప్రశ్నపత్రాల లీక్‌ వంటి ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు NMC స్పష్టం చేసింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *