తాజావార్తలు

Inter Supply Exams 2026: ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులకు వేసవి తరగతులు.. మే 12 వరకు నిర్వహణ..

Inter Supply Exams 2026: ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులకు వేసవి తరగతులు.. మే 12 వరకు నిర్వహణ..


హైదరాబాద్‌, ఏప్రిల్ 18: రాష్ట్ర ఇంటర్మీడియట్‌ ఫలితాలు గత ఆదివారం (ఏప్రిల్ 12) విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షల్లో తప్పిన విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 13వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ కూడా విడుదల చేశారు. అయితే సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్ధులను సిద్ధం చేయడానికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్‌ నికోలస్‌ మోడల్‌ స్కూళ్ల టీచర్లను ఆదేశించారు. మే 13వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో మే 12 వరకు తప్పిన సబ్జెక్టుల్లో విద్యార్ధులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, వారిని సిద్ధం చేయాలని సూచించారు.

ఈ నెల రోజుల పాటు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే వేసవి కాలం అయినందున ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు సైతం అవకాశమివ్వాలని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఎంఎస్‌టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు కోరారు. తద్వారా విద్యార్థులు, టీచర్లు సుదూర ప్రాంతాల నుంచి మండుటెండల్లో రాకపోకలు సాగించాల్సిన అవసరం ఉండదని విద్యాశాఖను కోరారు. దీనిపై విద్యాశాఖ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 2026 టైం టేబుల్ ఇదే

  • మే 13న సెకండ్ లాంగ్వేజ్
  • మే 14న ఇంగ్లిష్‌
  • మే 15న మ్యాథ్స్ ఏ, బోట‌నీ , పొలిటిక‌ల్ సైన్స్
  • మే 16న మ్యాథ్స్ 2ఏ, జువాల‌జీ, హిస్టరీ
  • మే 18న ఫిజిక్స్, ఎకనామిక్స్
  • మే 19న కెమిస్ట్రీ, కామ‌ర్స్
  • మే 20న ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ , బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్
  • మే 21న మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *