ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, యూత్, టోస్టర్, దో దివానే షెహర్ మే తదితర సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటితో పాటు పోచమ్మ, మట్కా కింగ్ వెబ్ సిరీస్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. అయితే బుధవారం ( ఏప్రిల్ 15) అర్ధరాత్రి నుంచే ఓ మలయాళం బ్లాక్ బస్టర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఒరిజినల్ తో పాటు తెలుగు వెర్షన్ కూడా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 06న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆకట్టుకునే కథా కథనాలు, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ అందించింది. సస్పెన్స్, మిస్టరీ అంశాలకు టైమ్ లూప్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కించిన ఈ సినిమాకు ఐఎమ్ డీబీలోనూ టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో కాకి ఆకారంలో ఉండే ఓ రహస్య ఆలయం చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది. ఆ ప్రాంతంలోకి వెళ్లేందుకు స్థానికులెవరూ సాహసం చేయరు. ఆ అడవిలోకి వెళితే ఎవరూ తిరిగి రారని వారి నమ్మకం. ఇదే క్రమంలో ఈ ఏరియా పోలీస్ స్టేషన్‌కు కొత్తగా ట్రాన్స్‌ఫర్ అవుతాడు ఆనంద్. ఆ తర్వాత ఇదే స్టేషన్‌లో పని చేస్తున్న రెజీ, స్టీఫెన్ అనే పోలీసులు నైట్ డ్యూటీకి వెళ్లగా… అడవిలో ఓ శవం కనిపిస్తుంది.
ఆ మృతదేహం వద్దకు వెళ్లిన వారు కాకి ఆకారంలో ఉండే ఓ రహస్య ఆలయాన్ని చూస్తారు. అంతే అక్కడి నుంచే అసలు కథ స్టార్ట్ అవుతుంది. అడవిలోకి వచ్చిన ఆనంద్, అతని టీంకు చిత్ర విచిత్ర అనుభవాలు ఎదురవుతాయి. అసలు ఆ మృతదేహం ఎవరిది? హత్య చేసింది ఎవరు? కాకి ఆకారంలో అక్కడ ఆలయం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏంటి? అడవిలోకి వచ్చిన వారు ఎందుకు మిస్ అవుతున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి
జియో హాట్ స్టార్ లో మలయాళం బ్లాక్ బస్టర్..
Presenting the official trailer #2 of Sambhavam Adhyayam Onnu on JioHotstar, starring Askar Ali, Vineeth Kumar, and Sidharth Bharathan. Now streaming exclusively on JioHotstar.#SambhavamAdhyayamOnnu #Trailer #Thriller #Mystery #Drama #MalayalaMovie #JioHotstar… pic.twitter.com/NRG85QZN12
— JioHotstar Malayalam (@JioHotstarMal) April 14, 2026
ఈ మలయాళం సినిమా పేరు సంభవం అధ్యాయం ఒన్ను. జీతూ సతీషన్ తెరకెక్కించిన ఈ మూవీలో అస్కర్ అలీ, వినీత్ కుమార్, అస్సిమ్ జమాల్, సిద్ధార్థ్ భరత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగులోనూ స్ట్రీమింగ్..
Sambavam Adhyayam Onnu is now streaming on JioHotstar. #SambhavamAdhyayamOnnu #Thriller #Mystery #Drama #MalayalaMovie #JioHotstar #JioHotstarMalayalam #NowStreaming pic.twitter.com/zRl0w8IP5x
— JioHotstar Malayalam (@JioHotstarMal) April 14, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
