తాజావార్తలు

రాశిఫలాలు: హమ్మయ్య..వారికి సుదీర్ఘ ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి

రాశిఫలాలు: హమ్మయ్య..వారికి సుదీర్ఘ ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి


దిన ఫలాలు (ఏప్రిల్ 14, 2026): మేష రాశి వారికి ఆర్థిక విషయాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులకు తగిన రాబడి లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో కొద్దిపాటి ఒత్తిడి ఉండే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో మీ సమర్థతకు విలువ పెరుగుతుంది. ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. మీ వ్యూహాలు, ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో అధికారులు, సహోద్యోగులు బాగా ప్రాధాన్యం ఇస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. స్థిరాస్తి సంబంధమైన లాభాలు చేతికి అందుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం సజావుగా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు అండగా ఉంటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులకు తగిన రాబడి లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో కొద్దిపాటి ఒత్తిడి ఉండే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, వృథా ఖర్చులు బాగా తగ్గుతాయి కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో మీ సమర్థతకు విలువ పెరుగుతుంది. ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి జీవితంలో బాగా బిజీ అయ్యే అవకాశం ఉంది. ఇంటా బయటా గౌరవమర్యాదలకు లోటుండదు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. స్థిరాస్తి సంబంధమైన వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు బాగా తగ్గుతాయి. ఉద్యోగంలో పనిభారం పెరిగే అవకాశం ఉంది. మరో ఉద్యోగానికి మారేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. అవసరానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులు ఆశించిన సమాచారాన్ని అందుకుంటారు. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెంచుతారు. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్ని విస్తరించే అవకాశం ఉంది. పెట్టుబడులకు తగ్గ లాభాలు అందుతాయి. వృత్తి జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ధనాదాయం చాలావరకు బాగుంటుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కొందరు బంధుమిత్రులతో వివాదాలు, అపార్థాలు చాలావరకు తొలగిపోతాయి. ముఖ్య మైన వ్యవహారాలు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆక స్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు, భూమి క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలు, ఆటంకాలు ఎదురైనా, పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ లేదు. ఆదాయానికి లోటుండదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రోజంతా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదరణ, ప్రోత్సాహం బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారపరంగా లాభాలకు లోటుండదు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. పిల్లల చదువులకు సంబంధించిన విషయాల్లో శుభ వార్తలు అందుతాయి. బంధువుల రాకపోకలుంటాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల వల్ల కలిసి వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలకు అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన క్రయవిక్రయాల్లో ఒప్పందాలు కుదర్చుకుంటారు. తండ్రి వైపు నుంచి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. ఆస్తికి సంబంధించిన దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అయి, కాస్తంత మానసిక ప్రశాంతత పొందుతారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రోజంతా ప్రశాంతంగా, అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహ కాలు అందుకుంటారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలతో కొత్త కార్యక్రమాలు చేపడతారు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. చదువుల్లో పిల్లలకు అండగా ఉంటారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాల చేస్తారు. వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేసి లబ్ధి పొందుతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. పిల్లలకు సంబంధించిన చదువులు, ఉద్యోగాలు, పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలు అధికారులకు లాభిస్తాయి. వ్యాపారాలు లాభాలపరంగా బాగా పురోగమిస్తాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుని విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు తొలగిపోతాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. ముఖ్యమైన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *