
ఢీ జోడీలో యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఆ తర్వాత హీరోయిన్ గానూ ఆకట్టుకుంది. పలు సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు నిర్మాతగానూ విజయాలు అందుకుంటోంది. ఆమె నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమా మంచి విజయం అందుకోవడమే కాకుండా పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఇదే విజయోత్సాహంలో ‘రాకాస’ అనే మరో సినిమాతో ఆడియెన్స్ ను పలకరించనుంది మెగా డాటర్. మానస శర్మ తెరకెక్కించిన ఈ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ లో సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో, హీరోయిన్లుగా నటించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 03)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటోంది నిహారిక. అలాగే వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటోంది.
రాకాస సినిమాలో జబర్దస్త్ నటుడు గెటప్ శ్రీను కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా నిహారిక గెటప్ శ్రీను గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘నా జీవితంలో నేను కలిసిన బెస్ట్ పర్సన్ గెటప్ శ్రీను. బ్లడ్ రిలేషన్ లేకపోయినా ఒక చెల్లెల్ని ఎంతగా చూసుకుంటారో, అంత ప్రేమ ఆయన చూపిస్తారు. మా ఇంట్లో వాళ్లు ఎంత ప్రేమిస్తారో, ఆయన కూడా అంతే కేర్ తీసుకుంటారు. షూటింగ్ సమయంలో కన్నా ప్రమోషన్స్ సమయంలో గెటప్ శ్రీనుతో మరింత దగ్గరయ్యాను. ఏదైనా టెన్షన్ ఉన్నా ముందుగా రిలాక్స్ అవ్వమని, టీ తాగమని చెప్పే వ్యక్తి ఆయన ‘ అంటూ జబర్దస్త్ నటుడిపై ప్రశంసలు కురిపించింది నిహారిక. ఇదే సందర్భంగా రాకాస తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ ‘బరి’లో గెటప్ శ్రీను నటిస్తాడని వెల్లడించింది నిహారిక. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
రాకాస సినిమా ప్రమోషన్లలో నిహారిక, గెటప్ శ్రీను.. వీడియో..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
