
ప్రస్తుతం ఓటీటీలో సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలు, సిరీస్ లను చూసేస్తున్నారు ఆడియెన్స్. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లను ఆయా భాషల్లోకి అనువాదం చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. అలా కొన్ని రోజుల క్రితం ఓటీటీలోకి వచ్చిన ఓ వెబ్ సిరీస్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. సాధారణంగా ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ల మూవీస్, వెబ్ సిరీస్ లలో కిల్లర్ లేదా క్రిమినల్ ఎవరన్నది చివరి దాకా రివీల్ చేయరు. కానీ ఈ సిరీస్ లో మాత్రం రెండో ఎపిసోడ్ లోనే సీరియల్ కిల్లర్ ను రివీల్ చేస్తారు. అతను హత్యలు ఎలా చేస్తున్నాడో చూపిస్తారు. అయినా ఈ సిరీస్ ఆసక్తిని కోల్పోదు. ఈ సిరీస్ కథ మొత్తం ఓ సీరియల్ కిల్లర్ కేసు చుట్టూనే తిరుగుతుంది. అతి చిన్న వయస్సులో ముంబై నగరానికి డీసిపి అయిన రీటా ఫెరారియా ఈ కేసును ఒక ఛాలెంజింగ్ గా తీసుకుంటుంది. ఉన్నట్లుండి నగరంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ హత్యలు కూడా ఒకే పంథాలో జరుగుతుంటాయి. ఓ సీరియల్ కిల్లర్ పోలీసులకు ఒక చిన్న క్లూ కూడా వదలకుండా చాలా పకడ్బందీగా ఈ మర్డర్లు చేస్తుంటాడు. అంతేకాదు బాధితులను చంపే ముందు వారిని దారుణంగా హింసిస్తుంటాడు.
కానీ పోలీసులు ఈ సైకో కిల్లర్ జాడను మాత్రం కనుక్కోలేకపోతారు. దీంతో ఆ కిల్లర్ మరింత రెచ్చిపోతాడు. చివరకు పోలీస్ స్టాఫ్ లో కూడా ఒకరిని హత్య చేస్తాడు. మరి క్రిమినల్ ను పట్టుకునేందుకు రీటా ఏం చేస్తుంది? అసలు ఆ సైకో కిల్లర్ ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు? అతని మోటివ్ ఏంటి? చివరకు ఆ సైకో కిల్లర్ పోలీసులకు దొరికాడా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ఉత్కంఠ భరిత సన్నివేశాలు, ఊహకు అందని ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆద్యంతం థ్రిల్లింగ్ గా సాగే ఈ క్రైమ్ సిరీస్ పేరు దల్ దల్. అమృత్ రాజ్ గుప్తా తెరకెక్కించిన ఈ సిరీస్ లో బాలీవుడ్ హీరోయిన్ భూమి పడ్నేకర్ ప్రధాన పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు తదితర భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది. మొత్తం ఏడు భాగాలున్న ఈ వెబ్ సిరీస్ లో హింసాత్మక సన్నివేశాలు చాలా నే ఉన్నాయి. కాబట్టి పిల్లలతో చూడకపోవడమే ఉత్తమం.
దల్ దల్ వెబ్ సిరీస్ ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
