తాజావార్తలు

ఎండాకాలం జాగ్రత్త.. ఈ సమస్యలున్న వారు బొప్పాయిని అస్సలు తినొద్దు.. పెద్ద కథే ఉందిగా..

ఎండాకాలం జాగ్రత్త.. ఈ సమస్యలున్న వారు బొప్పాయిని అస్సలు తినొద్దు..  పెద్ద కథే ఉందిగా..


ఎండాకాలం జాగ్రత్త.. ఈ సమస్యలున్న వారు బొప్పాయిని అస్సలు తినొద్దు..  పెద్ద కథే ఉందిగా..

కడుపు సమస్యలకు అరటిపండ్లు, బొప్పాయి వంటి పండ్లను తినడం చాలా మంచిది. బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది.. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందువల్ల, మలబద్ధకంతో బాధపడేవారు బొప్పాయి తినాలని సలహా ఇస్తారు. ఇది ఆరోగ్యానికి అనేక ఇతర విధాలుగా కూడా మేలు చేస్తుంది. అయితే, బొప్పాయికి శరీరాన్ని వేడి చేసే గుణం ఉంది. కావున.. వేసవి కాలంలో బొప్పాయి పండును తినవచ్చా..? దీనిని వేసవిలో తినడం సురక్షితమేనా, లేదా దాని వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందా అని చాలా మంది సందేహం వ్యక్తంచేస్తుంటారు. ఎందుకంటే, ఈ సమయంలో శరీరాన్ని చల్లబరచడానికి, చల్లదనాన్నిచ్చే గుణం ఉన్న పండ్లను తినమని సిఫార్సు చేస్తారు. కాబట్టి, వేసవిలో బొప్పాయి తినవచ్చా? లేదా..? దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు..? లాంటి విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

నిపుణులు ఏమంటున్నారు?

మీరట్‌కు చెందిన డైటీషియన్ అయేషా పర్వీన్ వివరించిన ప్రకారం.. బొప్పాయిని తేలికపాటి వేడినిచ్చేదిగా పరిగణించినప్పటికీ, ముఖ్యంగా పండినప్పుడు తింటే అది చల్లదనాన్ని కూడా ఇస్తుంది. వేసవిలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ఎందుకంటే ఇందులో అధిక నీటి శాతం ఉంటుంది.. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి, వడదెబ్బ నుండి రక్షించడానికి సహాయపడుతుంది.

బొప్పాయి జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించి, రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. బొప్పాయిలోని ఎంజైమ్‌లు కడుపును శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఇది చర్మం కాంతివంతంగా ఉండటానికి కూడా దోహపడుతుంది. బొప్పాయిలో కేలరీలు తక్కువగా, పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఒక మంచి ఎంపిక.

బొప్పాయిని ఎవరు తినకూడదు?

బొప్పాయికి శరీరాన్ని వేడి చేసే గుణం ఉందని, దీనిని అధిక పరిమాణంలో తీసుకుంటే కొంతమందిలో ఎసిడిటీ గ్యాస్‌కు కారణం కావచ్చని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బొప్పాయిని తినే ముందు వైద్యుడిని సంప్రదించాలి. వేసవిలో బొప్పాయిని మజ్జిగ, పెరుగు, దోసకాయ వంటి చల్లని ఆహారాలతో కలిపి తీసుకోవడం కూడా మంచిది. ఇది శరీరంలోని వేడిని తగ్గించి, సమతుల్యతను కాపాడుతుంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం ప్రయోజనకరం.. కానీ బొప్పాయి పడని వారు లేదా కడుపులో మంటగా అనిపించేవారు వెంటనే దానిని తినడం మానేయాలి. ఎసిడిటీ లేదా గుండెల్లో మంటతో బాధపడేవారు ఖాళీ కడుపుతో బొప్పాయి తినకూడదు. వేసవిలో బొప్పాయి తినడం మంచిదే, కానీ దానిని పరిమిత పరిమాణంలో, సరైన పద్ధతిలో తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే.. ఏదైనా సమస్యతో బాధపడుతుంటే.. వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *