తాజావార్తలు

Ustaad Bhagat Singh Twitter Review: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్విట్టర్ రివ్యూ.. పవన్ సినిమా టాక్ ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh Twitter Review: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్విట్టర్ రివ్యూ.. పవన్ సినిమా టాక్ ఎలా ఉందంటే?


Ustaad Bhagat Singh Twitter Review: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్విట్టర్ రివ్యూ.. పవన్ సినిమా టాక్ ఎలా ఉందంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. అలాగే కోలీవుడ్ స్టార్ నటుడు, దర్శకుడు పార్తీబన్ విలన్ గా మెప్పించారు. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. అలాగే తమన్ బీజీఎం స్కోర్ అందించారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ మూవీ ఎట్టకేలకు గురువారం (మార్చి 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉగాది కానుకగా ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లలో విడుదలైంది. ఏపీలో ఉదయం 4 గంటల నుంచే బెనిఫిట్ షోస్ పడగా, తెలంగాణలో 7 గంటల ఆటతో షోస్ మొదలు కానున్నాయి. మరి ఇవాళ థియేటర్లలోకి వచ్చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎలా ఉంది? పవన్ కల్యాణ్ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంది. మూవీ చూసిన పబ్లిక్ రియాక్షన్ ఏంటో ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం రంండి.

ఈ క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూసిన ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని ఇలా షేర్ చేసుకున్నాడు.. ‘పవన్ సినిమా సూపర్ అంతే. అమ్మతోడు చచ్చిపోతారు. ఏంట్రా సినిమా అస్సలు ఊహించలేదు. హరీష్ శంకర్ పవన్ కల్యాణ్ ను ఇలా చూపిస్తాడని అస్సలు అనుకోలేదు. థమన్ మ్యూజిక్ అదిరిపోయింది’ అంటూ ట్వీట్ చేశారు. మరో నెటిజన్ ‘ ఉస్తాద్ భగత్ సింగ్ బ్లాక్ బస్టర్ మూవీ, పవర్ స్టార్ టాప్ క్లాస్ మోడ్ లో ఉన్నాడు. సినిమా మొత్తం ఓ రేంజులో ఉంది. ప్రీ-ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ పీక్స్ లో ఉంది. థమన్ మ్యూజిక్ అదిరిపోయింది.. మాస్ డైలాగులు కెవ్వు కేక’ అని రాసుకొచ్చాడు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *