తాజావార్తలు

IPL Biggest Six: ఐపీఎల్ చరిత్రలోనే భారీ సిక్సర్ ఇదే.. 18 ఏళ్లుగా బద్దలవ్వని రికార్డ్ ఎవరిదంటే..?

IPL Biggest Six: ఐపీఎల్ చరిత్రలోనే భారీ సిక్సర్ ఇదే.. 18 ఏళ్లుగా బద్దలవ్వని రికార్డ్ ఎవరిదంటే..?


IPL Biggest Six: ఐపీఎల్ చరిత్రలోనే భారీ సిక్సర్ ఇదే.. 18 ఏళ్లుగా బద్దలవ్వని రికార్డ్ ఎవరిదంటే..?

IPL Biggest Six: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో భారీ సిక్సర్లు ప్రేక్షకులను అలరించాయి. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీ, కీరన్ పొలార్డ్ వంటి దూకుడు ఆటగాళ్లు భారీ హిట్లతో పేరు తెచ్చుకున్నా.. IPL చరిత్రలోనే అతి పొడవైన సిక్సర్ మాత్రం వీరిది కాదని మీకు తెలుసా? ఆ రికార్డు సొంతం చేసుకున్నది దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ ఆల్బీ మోర్కెల్. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతూ ఆయన 125 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. ఆశ్చర్యకరంగా, ఇప్పటి వరకు 18 సీజన్లు పూర్తయినా ఆ రికార్డు ఎవ్వరూ చెరపలేకపోయారు.

సంవత్సరాల వారీగా భారీ సిక్సర్లు..

IPL ప్రతి సీజన్‌లో అతి పెద్ద సిక్సర్లు నమోదవుతున్నా.. అవి మోర్కెల్ రికార్డుకు చేరువ కాలేకపోతున్నాయి.

2008 – ప్రవీణ్ కుమార్ (124 మీటర్లు)

2009 – ఆడమ్ గిల్‌క్రిస్ట్ (122 మీటర్లు)

2010 – రాబిన్ ఉతప్ప (120 మీటర్లు)

2011 – ఆడమ్ గిల్‌క్రిస్ట్ (122 మీటర్లు)

2012 – ఎంఎస్ ధోనీ (112 మీటర్లు)

2013 – క్రిస్ గేల్ (119 మీటర్లు)

2014 – డేవిడ్ మిల్లర్ (102 మీటర్లు)

2015 – ఏబీ డివిలియర్స్ (111 మీటర్లు)

2016 – బెన్ కట్టింగ్ (117 మీటర్లు)

2017 – ట్రావిస్ హెడ్ (109 మీటర్లు)

2018 – ఎబి డివిలియర్స్ (111 మీటర్లు)

2019 – ఎంఎస్ ధోనీ (111 మీటర్లు)

2020 – నికోలస్ పూరన్ (106 మీటర్లు)

2021 – కీరన్ పొలార్డ్ (105 మీటర్లు)

2022 – లియామ్ లివింగ్‌స్టోన్ (117 మీటర్లు)

2023 – ఫాఫ్ డుప్లెసిస్ (115 మీటర్లు)

2024 – హెన్రిచ్ క్లాసెన్ (108 మీటర్లు)

మోర్కెల్ రికార్డు ఎందుకు బ్రేక్ కాలేదు?

125 మీటర్ల సిక్సర్ అంటే సాధారణ విషయం కాదు. దీనికి పవర్ మాత్రమే కాదు, టైమింగ్, పిచ్ పరిస్థితులు, బౌలింగ్ వేగం అన్నీ కలవాలి. క్రిస్ గేల్, ధోనీ, డివిలియర్స్ లాంటి దిగ్గజాలు ఉన్నా.. ఈ రికార్డుకు చేరువ కాలేకపోవడం ఆశ్చర్యమే. ఆధునిక క్రికెట్‌లో ఫిట్‌నెస్, టెక్నాలజీ పెరిగినా ఈ రికార్డు చెరగకపోవడం దీని ప్రత్యేకతను తెలియజేస్తోంది.

IPL 2026లో రికార్డు బ్రేక్ అవుతుందా?

ప్రస్తుతం యువ ఆటగాళ్లు భారీ హిట్లతో ఆకట్టుకుంటున్నారు. లివింగ్‌స్టోన్, క్లాసెన్, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. IPL 2026లో ఈ రికార్డు బ్రేక్ అవుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే, మోర్కెల్ రికార్డు చెరిపేయాలంటే అసాధారణ ఇన్నింగ్స్ అవసరం.

IPLలో ప్రతి సీజన్ కొత్త రికార్డులు తీసుకొస్తున్నా.. మోర్కెల్ 125 మీటర్ల సిక్సర్ మాత్రం ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉంది. IPL 2026లో ఎవరైనా ఈ ఘనత సాధిస్తారా లేదా అన్నది చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *