తాజావార్తలు

Tuesday Born: కోపం ఎక్కువే కానీ.. మంగళవారం పుట్టినవారి భవిష్యత్తు ఇలా ఉంటుంది!

Tuesday Born: కోపం ఎక్కువే కానీ.. మంగళవారం పుట్టినవారి భవిష్యత్తు ఇలా ఉంటుంది!


Tuesday Born: కోపం ఎక్కువే కానీ.. మంగళవారం పుట్టినవారి భవిష్యత్తు ఇలా ఉంటుంది!

Astrology Tuesday Born: వారంలోని ప్రతి రోజుకు ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఆయా రోజుల్లో పుట్టిన వ్యక్తులకు కూడా ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారు. ఇప్పుడు మంగళవారం పుట్టినవారి భవిష్యత్తు గురించి తెలుసుకుందాం. మంగళవారం పుట్టిన స్త్రీ పురుషుల లక్షణాలు, వారి భవిష్యత్తు, ఏ రంగాల్లో రాణిస్తారు, అలాగే జీవితంలో సక్సెస్ సాధించడానికి ఎలాంటి ప్రత్యేక విధివిధానాలు పాటించాలో ఈ వ్యాసంలో వివరంగా తెలుసుకుందాం. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడు అంటే కోపానికి సంబంధించిన గ్రహం. కాబట్టి మంగళవారం పుట్టిన స్త్రీలకు గాని పురుషులకు గాని సహజంగా కోపం ఎక్కువగా ఉంటుంది. తమ మాట నెగ్గాలనే తత్వం, ఇతరులపై అధికారం చలాయించాలనే లక్షణం వీరిలో కనిపిస్తుంది. అయితే, వీరు ఇతరులకు సలహాలు, సూచనలు ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. అనేక మందికి మార్గదర్శకంగా నిలబడగలరు. అందరికీ సలహాలు ఇస్తారు, సూచనలు అందిస్తారు. కానీ, తమ అభిప్రాయాలను ఇతరులు గౌరవించాలని, తమ మాట నెగ్గాలని బలంగా కోరుకుంటారు.

విజయం సాధించేవరకూ..

మంగళవారం జన్మించిన వారిలో పట్టుదల అపారం. వీరు కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటారు. తొందరగా పరాజయాన్ని, అపజయాన్ని అంగీకరించరు. ఎంత కష్టమైనా సరే, అపజయాలను ఎదుర్కొని, చివరికి విజయం సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తారు. విజయం సాధించే వరకు విశ్రమించరు. వీరి జీవితంలో పెద్ద పెద్ద అపాయాలు ఎదురైనప్పుడు కూడా వాటిని వెంట్రుక వాసిలో తప్పించుకునే ప్రత్యేకమైన సామర్థ్యం వీరి సొంతం.

ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే..

అయితే, మంగళవారం పుట్టిన వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన వారి కోసం సర్వస్వాన్ని త్యాగం చేసే లక్షణం వీరిలో ఉంటుంది. అందుకే ప్రేమలో పడితే సర్వస్వాన్ని ధారపోసే తత్వం వీరిలో అధికం. ఈ విషయంలో మెచ్యూర్డ్‌గా ఆలోచించి, జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. అలాగే, పైకి ఒకలాగా, లోపల ఒకలాగా ప్రవర్తించే వ్యక్తుల విషయంలో వీరు అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వ్యక్తుల వల్ల జీవితంలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. అలాంటి వారితో దూరం పాటించడం శ్రేయస్కరం.

ఒకసారి అనుకుంటే చాలు..

మంగళవారం పుట్టిన ఆడవారు లేదా మగవారు ఒకసారి ఏదైనా అనుకుంటే దానిని చేసి తీరుతారు. వారి ఆలోచనలు, భావాలను ఎవరూ మార్చలేరు. తమ మార్గంలోనే ముందుకు వెళ్లే ప్రత్యేకమైన లక్షణం వీరిలో ఉంది.

ఏయే రంగాలు కలిసి వస్తాయంటే..

వృత్తిపరంగా చూస్తే, మంగళవారం పుట్టిన వారికి సాంకేతిక రంగం బాగా కలిసి వస్తుంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాలు వీరికి అనుకూలం. వ్యాపారాలు చేయాలనుకుంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదా కన్స్ట్రక్షన్ రంగం వీరికి చాలా మంచిది. డెంటల్ డాక్టర్లుగా కూడా మంగళవారం పుట్టిన వారు రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫైర్ రిలేటెడ్, అంటే అగ్నికి సంబంధించిన రంగాల్లో కూడా వీరు అద్భుతంగా విజయం సాధిస్తారు. ప్రధానంగా, రియల్ ఎస్టేట్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాల్లో ప్రవేశిస్తే అద్భుతమైన విజయాలను సాధించవచ్చు.

వీరి అదృష్ట సంఖ్య, కలిసొచ్చే రంగులు..

వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిది. ఏ పని చేసినా తొమ్మిది, పద్దెనిమిది, ఇరవై ఏడు తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. కలిసి వచ్చే రంగు ఎరుపు. ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం లేదా ఎరుపు రంగు కర్చీఫ్‌ను ఎప్పుడూ దగ్గర పెట్టుకోవడం వల్ల విజయాలు త్వరగా వస్తాయని నమ్మకం. మంగళవారం పుట్టిన వారు నవగ్రహాల్లో కుజుడిని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజూ వీలైనన్ని సార్లు “ఓం శ్రీ కుజాయ నమః” అనే మంత్రాన్ని జపించుకోవాలి. వీరికి కలిసి వచ్చే దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి. జీవితంలో త్వరగా విజయం సాధించాలంటే ఈ దైవాలను పూజించడం ద్వారా త్వరగా సక్సెస్ సాధిస్తారు.

.(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *