తాజావార్తలు

ప్రాణం తీసిన బైక్ పొగ.. చిన్నపాటి నిర్లక్ష్యంతో నలుగురు దుర్మరణం.. ఇలాంటి మిస్టెక్స్ చేయకండి..

ప్రాణం తీసిన బైక్ పొగ.. చిన్నపాటి నిర్లక్ష్యంతో నలుగురు దుర్మరణం.. ఇలాంటి మిస్టెక్స్ చేయకండి..


ప్రాణం తీసిన బైక్ పొగ.. చిన్నపాటి నిర్లక్ష్యంతో నలుగురు దుర్మరణం.. ఇలాంటి మిస్టెక్స్ చేయకండి..

అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుంగనూరులోని త్యాగరాజు వీధిలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనకు నిర్లక్ష్యం కారణమైంది. త్యాగరాజు వీధిలో ఉంటున్న మురళి సెలూన్ షాప్ నిర్వహిస్తున్నాడు. మురళి రేవతి దంపతులకు నలుగురు సంతానం కాగా తల్లిదండ్రులతో కలిసి త్యాగరాజు వీధిలోనే మురళి నివాసం ఉన్నాడు. మురళి బైక్ రిపేరుకు రావడంతో నిన్న మెకానిక్ వద్ద మోటర్ బైక్ ను బోర్ చేయించాడు. బైక్ ను స్టార్ట్ చేసి రాత్రంతా కూలింగ్ కోసం అలాగే ఉంచాలని మెకానిక్ చెప్పడంతో బైక్ ను ఇంటికి తీసుకొచ్చిన మురళి.. రాత్రంతా ఇంజన్ ను రన్నింగ్ లో ఉంచాడు.

బైక్ ఇంజన్ ఆఫ్ చేయక పోవడంతో రన్నింగ్ లో ఉన్న బైక్ నుంచి వచ్చిన విష వాయువు.. ఇంట్లో పడుకున్న వారికి ఊపిరి ఆడకుండా చేసింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న మురళి తండ్రి రామచంద్రయ్యతో పాటు మురళి కొడుకు, ఇద్దరు కూతుళ్లు విషవాయువు పీల్చి విగత జీవులుగా పడిపోయారు.

ప్రమాదంలో మురళి తండ్రి రామచంద్రయ్యతో పాటు మురళి కొడుకు కార్తీక్, కూతుళ్లు కవలలు చరిత, చందన మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంటి మిద్దెపై మురళి అతని భార్య రేవతి నిద్రిస్తుండగా, మురళి తల్లి పెద్ద కూతురు రెండు రోజులు క్రితం బంధువుల ఊరికి వెళ్లినట్లు పేర్కొంటున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. విషవాయువు పీల్చడంతోనే నలుగురు చనిపోయినట్లు పేర్కొంటున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు బంధువులు ఉన్న వీధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఇరుకైన ఇంట్లో కిటికీలు లేకపోవడం, వెంటిలేషన్ లేక బైక్ ఇంజిన్ నుంచి వచ్చిన పొగ ఇల్లంతా అలుముకోవడంతో ఊపిరాడక నలుగురు మృతి చెందినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటన సంచలనంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *