తాజావార్తలు

Tollywood : అతడిని చూస్తుంటే బాధేస్తుంది.. ఎక్కడో ఉండాల్సిన వాడు.. ఇప్పుడు ఈ పరిస్థితిలో.. జబర్దస్త్ అప్పారావు..

Tollywood : అతడిని చూస్తుంటే బాధేస్తుంది.. ఎక్కడో ఉండాల్సిన వాడు.. ఇప్పుడు ఈ పరిస్థితిలో.. జబర్దస్త్ అప్పారావు..


Tollywood : అతడిని చూస్తుంటే బాధేస్తుంది.. ఎక్కడో ఉండాల్సిన వాడు.. ఇప్పుడు ఈ పరిస్థితిలో.. జబర్దస్త్ అప్పారావు..

జబర్దస్త్ అప్పారావు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శకలక శంకర్ కెరీర్, ప్రస్తుత పరిస్థితిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. తన ఎదుగుదలకు శకలక శంకరే కారణమని పేర్కొంటూ, “శకలక శంకర్ అన్న ఆయన చూస్తే మీకు ఏమనిపిస్తది అంటే.. ఈ టైంలో మీరు ఆయన గురించి ఎప్పుడైనా ఆలోచిస్తారా? అంటే కొద్దిగా బాధపడ్డా. అతని వల్ల నేను ఇంత పేరు వచ్చింది” అని అప్పారావు తెలిపారు. శంకర్ ఈ రోజు చాలా పెద్ద పొజిషన్‌లో ఉండాల్సిన వ్యక్తి అని, కానీ ఆయన ప్రస్తుత స్థితి బాధాకరమని అన్నారు. శంకర్ జబర్దస్త్ టీమ్‌లో ఉన్నప్పుడు, కాలేజీ ఈవెంట్ల కోసం 50,000 రూపాయలు, ఫ్లైట్, స్టార్ హోటల్ వంటి భారీ ఆఫర్లను తిరస్కరించేవారని అప్పారావు గుర్తు చేశారు. కేవలం జబర్దస్త్, సినిమా రంగంపైనే దృష్టి సారించిన శంకర్, ఈవెంట్లు చేసి ఉంటే ఈ రోజు కోట్లు సంపాదించి ఉండేవాడని అప్పారావు అభిప్రాయపడ్డారు. శంకర్ బెంగాల్ టైగర్, రామ్ చరణ్ నాయక్ వంటి సినిమాల్లో నటిస్తున్న సమయంలోనూ, రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి షూటింగ్‌లు, ప్రాక్టీస్‌లు చేస్తూ జబర్దస్త్ స్కిట్‌లలో చురుగ్గా పాల్గొనేవారని వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

అయితే, శంకర్ కెరీర్ సినిమాలలో అనుకున్నంతగా సాగలేదని అప్పారావు తెలిపారు. శంభో శంకర సినిమాతో హీరోగా మారిన తర్వాత, అతనికి కమెడియన్‌గా అవకాశాలు తగ్గాయని, ఇతర హీరోల సినిమాల్లో కమెడియన్‌గా తీసుకోవడానికి నిర్మాతలు వెనకాడారని అప్పారావు అన్నారు. శంకర్ జబర్దస్త్‌ను వీడినప్పుడు నాగబాబుతో సహా చాలా మంది బాధపడ్డారని, ఎంతో మంది దర్శకులు అతనికి తెలుసు కాబట్టి సినీ పరిశ్రమలో మంచి భవిష్యత్తు ఉందని భావించారని అప్పారావు పేర్కొన్నారు. శకలక శంకర్ రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల తన జీవితాన్ని పాడు చేసుకోలేదని అప్పారావు స్పష్టం చేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే శంకర్‌కు ప్రాణం లాంటి అభిమానం అని, పవన్ కళ్యాణ్ ఫోటోను జబర్దస్త్ స్టేజ్‌పై వేసింది శంకరే అని గుర్తు చేశారు. శంకర్ మంచి ఆర్టిస్ట్ అని, డ్రాయింగ్ వేయడం, స్టోరీబోర్డ్‌లు చేయడం, పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం వంటి అనేక టాలెంట్లు ఉన్న మల్టీ టాలెంటెడ్ వ్యక్తి అని ప్రశంసించారు.

ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..

ప్రస్తుతం శకలక శంకర్ ఒక తమిళ సినిమాలో హీరోగా నటిస్తున్నాడని, ఒక సినిమాకు దర్శకత్వం వహించే ఆలోచనలో కూడా ఉన్నాడని తెలిపి అప్పారావు ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవలే శంకర్ తనకు ఫోన్ చేసి ఈ విషయాలు చెప్పాడని, తన ఫోన్‌లో శంకర్ పేరు దేవుడు అని సేవ్ చేసుకున్నానని అప్పారావు తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‏గా చెప్పేసిన హీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‏లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *