
ఇది ఆల్‌మోస్ట్ లాక్‌డౌనే. కరోనా మహమ్మారొక్కటే లేదంతే. మన దగ్గర మరీ అంత సిచ్యుయేషన్ లేదు గానీ.. కొన్ని దేశాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్‌ను సీరియస్‌గా అప్లై చేస్తున్నారు. హాలిడేస్ ఇచ్చేస్తున్నారు స్కూళ్లు కాలేజీలకు రావొద్దని. వియత్నాంలో పెట్రోల్, డీజిల్ సేవ్ చేయడానికి ఉద్యోగులను, సాధారణ ప్రజలను కూడా ఇంట్లోనే ఉండాలని చెప్పింది. యూరప్ కంట్రీస్ కూడా గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించే ఆలోచనలో ఉన్నాయి. బంగ్లాదేశ్.. ఆల్రడీ కరెంట్‌ను ఆదా చేయడానికి, రోడ్లపై జనం తిరగడాన్ని తగ్గించడానికి విద్యా సంస్థలన్నిటికీ హాలిడేస్ ఇచ్చింది. పాకిస్తాన్ కూడా.. పెట్రోల్, డీజిల్ అయిపోతోందని రెండు వారాల పాటు స్కూళ్లు మూసేయాలని ఆదేశించింది. పాక్‌లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అమలవుతోంది. ఫిలిప్పీన్స్.. గవర్నమెంట్ ఆఫీసులలో వారానికి నాలుగు రోజులే పని చేయాలనే ఆర్డర్స్ ఇవ్వబోతోంది. థాయిలాండ్‌దీ అదే దారి. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఉద్యోగులు ఇంటి నుండే పని చేయాలని ఆదేశాలిచ్చింది.
దోశ ఏం పాపం చేసిందో గానీ.. దాన్ని కట్ చేస్తున్నాయి హోటల్స్. బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు ఇదే సిచ్యుయేషన్. మంగళగిరిలో చిన్న చిన్న కాకా హోటళ్లు మూతపడుతున్నాయ్. గ్యాస్ ఉన్న వాళ్లు మాత్రం హోటల్ రన్ చేస్తున్నారు. ఆడవాళ్లంతా ఫ్రీ బస్‌కి వెళ్తున్నారు. ఉన్నవాళ్లతోనైనా ఆటో నడిపిద్దామంటే.. పూటపూటకు గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయని తెగ బాధపడిపోతున్నారు ఆటోవాలాస్. వచ్చిన వాళ్లంతా పూరీలు, బోండాలు అడుగుతున్నారట. టిఫిన్ సెంటర్ల వాళ్లే.. అదొక్కటి తప్ప అంటున్నారు. హాస్టల్‌లో ఉండే వారికి పెద్ద కష్టమే వచ్చింది. మెనూ దారుణంగా తగ్గించారు. ఇంకో రెండ్రోజులైతే.. అసలుకే మూసేయాల్సిన వస్తుందంటున్నారు. అటు హాస్టల్ లేక.. ఆఫీస్‌లో క్యాంటిన్ లేక.. తినేదెలా, ఉద్యోగం చేసేదెలా, ఇక్కడ ఉండేదెలా అని బాధపడిపోతున్నారు హాస్టలర్స్. ఇది మరో రకం సమస్య. గ్యాస్ లేకపోతే కట్టెల పొయ్యిపై వండుతారు. కాని, ఇప్పటి వంట మాస్టర్లేమో.. కట్టెల పొయ్యిపై ఎలా వండాలో తెలియదంటున్నారు. సో.. పిటీ కదా.
హోటళ్లకు గ్యాస్‌కు ఆల్టర్నేటివ్ కచ్చితంగా కట్టెల పొయ్యే. ఇండక్షన్ స్టవ్‌తో అంతంత వంటలు చేయలేరు. కాని, ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే.. దానిపై ఎలా వండాలో తెలియకపోవడం. పిస్తా హౌజ్ నిర్వాహకులు అదే చెబుతున్నారు. కట్టెలు తెచ్చాం, బొగ్గు తెచ్చాం, వండేందుకు సరుకులు తెచ్చాం.. కాని, ఎలా వండాలో తెలియదంటూ వంట మాస్టర్లు హ్యాండ్ ఇస్తున్నారట.
నెక్ట్స్ గ్యాస్ సెగ ఆలయాలకే. అయోధ్యలో అన్నప్రసాదం ఆపేశారు. మరి తిరుమలలో. ఇప్పటికైతే అలర్ట్‌గా ఉన్నామనే చెబుతున్నారు. ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ గ్యాస్ కొరత రాకుండా చూస్తున్నామని చెబుతున్నారు. కాకపోతే.. గల్లీలో టిఫిన్ సెంటర్ల నుంచి స్టార్ హోటళ్ల వరకు ఎవరికీ గ్యాస్ సిలిండర్లు దొరకడం లేదు. ఆలయాలకూ మినహాయింపు ఇవ్వడం లేదు. మరి తిరుమల పరిస్థితేంటనే చర్చ జరుగుతోంది. మొత్తానికి.. సామాన్యులపై అన్ని రకాలుగా ఎఫెక్ట్ చూపిస్తోంది గ్యాస్ షార్టేజ్.
యుద్ధ ప్రభావం ఇంత త్వరగా, ఈ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపిస్తుందని ఊహించలేదెవరు. కానీ.. తెలియకుండానే సెగ తగులుతూనే ఉంది. ముందుగా గ్యాస్ బండ పేల్చారు. ఆ తరువాత.. షార్టేజ్ ఉందన్నారు. కమర్షియల్ బండ కట్ చేశారు. ఆ ఎఫెక్ట్ ఇలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు మరో స్టేజ్. గ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా ధరలు పెరగడం చూడబోతున్నాం. ఆల్రడీ మొదలైంది కూడా ఈ సెగ.
గ్యాస్ దొరక్కపోవడం అనే సమస్య.. దేశవ్యాప్తంగా కోట్ల మంది జీవితాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గ్యాస్‌తో నడిపే క్యాబ్, ఆటోవాలాలకు. ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. LPG-CNG కోసం ఫిల్లింగ్ స్టేషన్ల ముందు పడిగావులు పడుతున్నారు. పైగా గ్యాస్ ధరలను ఎప్పటికప్పుడు పెంచేస్తున్నారని చెబుతున్నారు.
అసలే రంజాన్ సీజన్. హలీమ్ బిజనెస్ కోట్లలో జరుగుతుంది. సరిగ్గా ఇలాంటి సమయంలో నెత్తిన బండేసింది గ్యాస్. హైదరాబాద్ నైట్ బజార్ జన విహీనంగా కనిపిస్తోంది. హైదరాబాద్ బిర్యానీ హోటల్స్ తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. హలీమ్ వ్యాపారంపై భారీగా దెబ్బ పడింది.
అటు.. స్విగ్గీ-జొమాటో ఇండస్ట్రీపై ఆధారపడ్డ గిగ్ వర్కర్స్ ఆందోళన పడుతున్నారు. ఆర్డర్ చేసేవాళ్లున్నా.. తయారు చేసేవాళ్లు లేరు. సో, అల్టిమేట్‌గా డెలివరీ బాయ్స్‌కి పనిలేకుండా పోయింది. సంపాదన పూర్తిగా ఆగిపోయింది.
ఇక విమానం టికెట్లకు రెక్కలొచ్చాయి. క్రూడాయిల్ కొరతతో విమానాల్లో వాడే ఎయిర్ టర్బైన్ ఫ్యుయల్ ధరలు పెరుగుతున్నాయి. ఆ భారం భరించలేక.. ఫ్యూయల్ సర్ ఛార్జ్ బాదుడు షూరూ చేశారు. ఆల్రడీ దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్ ఛార్జీలు పెంచేసింది ఎయిరిండియా. ఇతర ఎయిర్ లైన్స్ కూడా అదే దారిలో ఉన్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గ్యాస్ ఎఫెక్ట్ గట్టిగానే తగులుతోంది. ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తి చేయాలంటే కచ్చితంగా గ్యాస్ కావాలి. పరిస్థితి చూస్తుంటే.. గ్యాస్ అందేలా కనిపించడం లేదు. దీంతో ఫినిష్డ్ స్టీల్ ప్రొడక్షన్ పూర్తిగా నిలిచిపోనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
