ఇటు ‘ఉత్సాహ లేనిదే గొప్పతనాన్ని సాధించలేము’ అన్నారు ఎమర్సన్. విజయం సాధించాలంటే ఎన్నటికి అలసిపోని ఉత్సాహం ఉండాలి.
ఉదయమ్ లేచి T.V.చూస్తే T.V. యాంకర్లు చక్కటి చిరునవ్వుతో ఎనలేని ఉత్సాహంతో మనల్ని పలకరిస్తారు. వారి పెదవుల్లో వెల్లివిరిసే ఉత్సాహం మనలో ఓ కొత్త నూతనోత్సాహాన్ని నింపుతుంది.
అలాగే కాలేజీల్లో, స్కూళ్లల్లో మనం ఎంతోమంది టీచర్లని చూస్తుంటాం. వారిలో ఉత్సాహం పొంగిపొరలే వారిని మనం ఇష్టపడుతాం.
అలాగే మనం ఎంతోమందిని కలుసుకోవడానికి ఆఫీసులకెళ్తాం. అక్కడ నవ్వుతూ విష్ చేసే రిసెప్షనిస్ట్లు, నర్సులు మనలో ఉత్సాహాన్ని నింపుతారు.

కాబట్టి ఏ రంగంలో విజయం సాధించాలన్నా అంతులేని ఉత్సాహంతో ఉండాలి. ఆ వుత్సాహం సహజంగా రావాలి తప్ప తెచ్చిపెట్టుకున్నదై వుండకూడదు. https://www.youtube.com/watch?v=5o32bxqdwio&pp=ygUbVW53YXZlcmluZyBlbnRodXNpYXNtIFRMVUdV
అది పరీక్ష కోసం కానీయండి, ఉద్యోగం కోసం కానీయండి, వ్యాపారంలో కానీయండి. అంతులేని ఉత్సాహంతో ముందుకు సాగాలి. ‘అబ్బే! అది నేను సాధించగలనా? అది సక్సెస్ అవుతుందా’ అన్న నిరాశవాదం ఎప్పుడూ పనికి రాదు.
కొంతమంది ఎప్పుడూ చూసినా నిద్రపోతూనో, ఆవలిస్తూనో వుంటారు. చాలా నెమ్మదిగా పీతలా చేస్తారు ఏ పనైనా. మనకు చికాకు వేస్తుంది. వారి నీరసం మనకు ఎక్కడ అంటుకుంటుందా అని భయం వేస్తుంది.
అలాంటి నీరసపు మొహాలు, డల్ శరీరాలు మీవి కానివ్వకండి. అలాంటి వారిని కలసి మీ శరీరంలో వున్న కొద్దిపాటి ఉత్సాహాన్ని పోగొట్టుకోకండి.
విజయం సాధించాలంటే మీ మనస్సు, శరీరం అణువణువూ సెలయేరులా ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతూ పారుతూ వుండాలి. అప్పుడే మన శరీరం జలపాతంలో ఉరుకుతూ active గా వుంటుంది.
ఈ ఉత్సాహాన్ని మించి …గుణం మరొకటి లేదు. ఈ ఉత్సాహంతోనే మనం మన క్రింది వారిని ప్రోత్సాహపరుస్తూ ముందుకు సాగేటట్లు చేయగలం.
ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా వెరువక ముందుకు సాగేవారే ఎట్టకేలకు విజయాన్ని సాధించగలరు.
మీకు ఆంజనేయస్వామి గుర్తున్నారు కదా! ఎన్ని కష్టాలు వచ్చిన వెరవక అమితోత్సాహంతో విజయం సాధిస్తారు. ఉత్సాహం వున్నవారి దగ్గరే బలం వుంటుంది. మీరే పని చేయాలన్నా అలాంటి ఉత్సాహం కావాలి.
అలాంటి తిరుగులేని ఉత్సాహాన్ని పొందటం ఎలానో చూద్దాం.
A,B,C,D,POINTA లలో చూద్దాం
A.మీరు సహజంగా ఉండండి:
కొంతమంది వ్యక్తులు తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతో వుంటారు. ఏదైనా పార్టీ లేదా సమావేశం ఉన్నప్పుడు యమ ఏక్టివ్గా వున్నట్లుగా నటిస్తారు. అలాకాక సహజంగానే మీరెప్పుడూ రోజంగా సంతోషంగా వుండండి. అందుకోసం మీరు ఏం చెయ్యాలో చూద్దాం.
- మొహం నుండి ఎప్పుడూ చిరునవ్వు వెలుగుతుండాలి.
2.సంతోషం మీరున్న పరిసరాలలో కొట్టొచ్చినట్లుండాలి.
3.జీవితమంతా సుందరవనం అన్నట్లుగా సున్నితభావాలు పెంచుకోవాలి. మనుషుల పట్ల కోపం, ద్వేషం, అసహనం, జెలసీ లాంటి ప్రతికూల భావాలను విడనాడండి.
4.ఎల్లప్పుడూ సంతోషంగా వుండాలి.
B.మీ భావోద్వేగాలను నిర్భయంగా ప్రకటించండి
మీలో కలిగే సంతోష భావోద్వేగాలను నిర్భయంగా ప్రకటించండి. జీవితంలో లేదా కార్యాలయంలో జరిగే ప్రతి ప్రత్యేక సందర్భాన్ని ఇతరులతో పంచుకోండి.
C..గమ్యాలను నిర్దేశించుకోండి
గమ్యం లేకుండా మీరు ఉత్సాహంగా ఎలా వుండగలరు? జీవితంలో ఒక గమ్యం కోసం పాటుపడుతున్నప్పుడు ఉత్సాహం సైతం మీలో పొంగి
D.కొన్ని రకాల శారీరక పద్దతులను ప్రాక్టీసు చేయండి
మీలోని ఉత్సాహాన్ని పెంపొందించుకోవాలంటే మీరు తరచు మాట్లాడుతూ వుండండి. నవ్వటానికి రెడీగా వుండండి. చిరునవ్వు చిందించండి. ఊపిరి గాఢంగా పీల్చండి. ఆఖరికి CELL PHONE లో సైతం మాట్లాడుతున్నప్పుడు మీలోని ఉత్సాహం అవతల వ్యక్తికి తెలియాలి.https://www.youtube.com/watch?v=MP1Eo7xy5GU&pp=ygUbVW53YXZlcmluZyBlbnRodXNpYXNtIFRMVUdV
చివరిగా..
👉 జీవితంలో విజయం సాధించాలంటే తిరుగులేని ఉత్సాహం చాలా అవసరం.
👉 ప్రతి రోజు చిన్న చిన్న లక్ష్యాలను సాధిస్తూ ముందుకు సాగితే విజయం మనదే అవుతుంది.
👉 మీలోని శక్తిని నమ్మండి, మీ ప్రయత్నాన్ని కొనసాగించండి.
ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన సమాచారం కోసం A2Z Chronicle ను ఫాలో అవ్వండి.
