మనీ ప్లాంట్ : మనీ ప్లాట్ లేని ఇల్లు ఉండదు. చాలా మంది ఈ మొక్కను పెంచుకుంటున్నారు. అయితే కొంత మంది వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ పెంచుకుంటే, మరికొంత మంది ఇంటి అందం కోసం పెంచుకుంటారు. కానీ ఇంటిలో మనీ ప్లాంట్ మొక్క పెట్టుకోవడం వలన ఇది స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. అంతే కాకుండా, గాలిలోని మలినాలను ఫిల్టర్ చేసి, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. అలాగే ఇంటిని చాలా చల్లగా మార్చుతుంది.
స్నేక్ ప్లాంట్ : స్నేక్ ప్లాంట్ ఇంటిలో పెంచుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వలన అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. స్నేక్ ప్లాంట్ ఇంటిలో బెడ్ రూమ్, లివింగ్ రూమ్ ఎక్కడ పెట్టుకున్నా, చాలా మంచిది. ఇది పగటి పూట గాలిని శుద్ధి చేసి, రాత్రి సమయంలో ఆక్సిజన్ విడుదల చేస్తుంది. అలాగే ఇంటిని చాలా చల్లగా, కూల్ కూల్‌గా మారుస్తుంది. అందుకే తప్పనిసరిగా ఈ స్నేక్ ప్లాంట్ మొక్కను ఇంటిలో నాటుకోవాలి అంట.
రబ్బరు మొక్క : రబ్బరు మొక్క ఇంటిలో తప్పకుండా పెంచుకోవాల్సిన మొక్కల్లో ఒకటి. ఇది పర్యావరణాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా ఈ మొక్కకు చల్లబరిచే గుణం ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని ఇంటిలో పెట్టుకోవడం వలన మండే ఎండాకాలంలో కూడా ఇల్లు మొత్తం చాలా చల్లగా, కూల్ కూల్‌గా ఉంటుంది.
అరేకా తాటి చెట్టు : అరేకా తాటి చెట్టు ఇది ఇంటికి చాలా అందాన్ని తీసుకొస్తుంది. అంతే కాకుండా, దీనిని ఇంటిలో పెట్టుకోవడం వలన ఇది స్వచ్ఛమైన గాలినిఅందిస్తుంది. ఇంటిని చాలా చల్లగా, తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ సమ్మర్లో ఏసీ, కూలర్ కంటే, ఈ మొక్కలు ఇంట్లో పెంచుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.
ఫెర్న్ ప్లాంట్ : వేసవిలో ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండాల్సిన ఇండోర్ ప్లాంట్స్‌లో ఫెర్న్ మొక్క ఒక్కటి. ఇది ఎండాకాలంలో ఇంటిని సహజంగానే చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా ఇంటిలోపలి గాలిని శుద్ధి చేస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.





