
రీసెంట్ గా చాలా మంది సెలబ్రెటీలు పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. అలాగే మరికొంతమంది ప్రేమలో తేలిపోతున్నారు. ఇదిలా ఉంటే సినీ సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ప్రేమలు, పెళ్లిళ్లు వంటి వార్తల్లో నిలుస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ , రష్మిక పెళ్లి చేసుకోనున్నారు. అలాగే తమిళ్ హీరో విజయ్ దళపతి భార్య విడాకులు కావాలంటూ కోర్టుకెక్కారు. ఇలా సినీ సెలబ్రెటీల ప్రేమలు, పెళ్లిలాంటి విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది రెండు మూడు పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఈ స్టార్ హీరోయిన్ ఒకరు. కెరీర్లో అద్భుతమైన విజయాలు సాధించినా ఆ హీరోయిన్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను చూసింది. రెండు పెళ్లిళ్లు చేసుకుంటే ఇద్దరు భర్తలు చనిపోయారు. ప్రస్తుతం ఒంటరిగా ఉంటుంది ఆ ముద్దుగుమ్మ. ఆమె ఎవరో తెలుసా.?
బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చున్న భామ.. లీనా చందావర్కర్. సినిమా పరిశ్రమలో 1960ల చివరి మరియు 1970ల ప్రారంభంలో ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె హిందీ సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించారు లీనా చందావర్కర్. ఫిల్మ్‌ఫేర్ ఫ్రెష్ ఫేస్ పోటీలో రన్నరప్‌గా నిలిచి, ప్రచారాలు చేస్తూ సినిమాల్లోకి ప్రవేశించారు. సునీల్ దత్త్ దర్శకత్వంలో 1968లో మన్ కా మీట్‌తో డెబ్యూ చేశారు. 1969 నుంచి 1979 వరకు 50కి పైగా సినిమాల్లో నటించారు.
ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా, సంజీవ్ కుమార్, దిలీప్ కుమార్, జీతేంద్ర వంటి స్టార్లతో ఆమె నటించారు. అయితే లీనా జీవితం ట్రాజెడీ మాత్రం ఎక్కువే.. 1975లో 24 ఏళ్ల వయసులో గోవా ముఖ్యమంత్రి దయానంద్ బండోడ్కర్ కుమారుడు సిద్ధార్థ్ బండోడ్కర్ను వివాహం చేసుకున్నారు లీనా. కానీ పెళ్ళైన 11 రోజుల్లోనే గన్ ఫైర్ ప్రమాదంలో సిద్ధార్థ్ మరణించారు. ఈ ఘటన ఆమె కెరీర్‌ను ప్రభావితం చేసింది. ఆ తర్వాత 1980లో పాపులర్ సింగర్ కిషోర్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె 7 నెలల గర్భవతిగా ఉంది. వారికి సుమీత్ కుమార్ అనే కుమారుడు. 1987లో కిషోర్ హార్ట్ అటాక్‌తో మరణించారు, లీనా 37 ఏళ్ల వయసులో రెండో భర్త కూడా చనిపోయాడు. ఆ తర్వాత ఆమె ఒంటరిగానే ఉంటున్నారు. ఒంటరిగా కొడుకుతో పాటు మరికొంతమంది పిల్లలను కూడా దత్తత తీసుకొని పెంచుకున్నారు లీనా.. ప్రస్తుతం ఆమె ముంబైలో నివాసముంటున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
