
దిన ఫలాలు (మార్చి 7, 2026): మేష రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులు కొత్త అవకాశాలను అందుకుంటారు. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. ఆస్తి వివాదాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు. మీ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాలలో కొన్ని ప్రధానమైన సమస్యలను, అడ్డంకులను తొలగించుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులు కొత్త అవకాశాలను అందుకుంటారు. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో వివాదాస్పద అంశాలకు, అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఇంటా బయటా పనిభారం, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనికీ ఒకటికి రెండుసార్లు తిరగాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. ఆస్తి వివాదాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిత్రుల సహాయంతో అదనపు ఆదాయ ప్రయత్నాలు చేపడతారు. వ్యాపారాల పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగ జీవితం సాఫీగా, సానుకూలంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపడతారు. కొత్త నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. ఆస్తి వివాదాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేపట్టిన పనుల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులు తమ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. పని భారం ఎక్కువగానే ఉన్నా ప్రతిఫలం తప్ప కుండా ఉంటుంది. అధికారులు అప్పగించిన బాధ్యతల్ని ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొందరు మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి సమయం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో ఏ మాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఇష్టమైన స్నేహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. తలపెట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు, ఇతర బిజినెస్ రంగంలో ఉన్నవారికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు సద్దుమణుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో అధికారులు కొన్ని ప్రత్యేక లక్ష్యాలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులకు గుర్తింపుతో పాటు బాగా డిమాండ్ పెరుగుతుంది. దగ్గర బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. అనుకోకుండా ఒక శుభవార్త వింటారు. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా శుభ ఫలితాలనిస్తాయి. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని ధన లాభం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండదు కానీ, వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలుంటాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలేర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో సహచరుల వల్ల ఇబ్బందులుంటాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంతో ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా మారుతుంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. గృహ, వాహన సౌకర్యాలపై దృష్టి పెడతారు. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీఉండదు..
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1)
వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. సర్వత్రా మాటకు విలువ పెరుగుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడు తుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. బంధుమిత్రులతో ఉత్సాహంగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సన్నిహితులతో వాదోపవాదాలకు దిగవద్దు. కొందరు ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆరోగ్యం పరవాలేదు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వీలైనంతగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొన్ని కొత్త ప్రయత్నాలను చేపట్టవచ్చు. పెండింగులో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా అదనపు ఆదాయ ప్రయత్నాలు కొనసాగుతాయి. వృత్తి, ఉద్యోగాల మీద శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగుతాయి. స్వయం ఉపాధి, వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అది తప్పకుండా సఫలం అవుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అంది వస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. బంధువులతో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి.
